పొగాకు, గుట్కా, పాన్ మసాలాలపై నిషేధం.. 

షేర్ చేయండి:
పొగాకు, గుట్కా, పాన్ మసాలాలపై నిషేధం.. 

సాక్షి లైఫ్ : తెలంగాణ రాష్ట్రం పొగాకు ఉత్పత్తులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. పొగాకు, నికోటిన్‌తో కూడిన గుట్కా, పాన్‌మసాలా తయారీ, విక్రయాలపై నిషేధం విధించింది. పొగాకు ఉత్పత్తుల విక్రయం, నిల్వ, పంపిణీపై ఏడాది పాటు నిషేధం ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నిషేధం 24 మే 2024 నుంచి అమలులోకి వస్తుంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఉత్తర్వులు తీసుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది.

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 పొగాకు ఉత్పత్తుల విక్రయం


తెలంగాణ రాష్ట్రంలో పొగాకు, నికోటిన్‌తో కూడిన గుట్కా, పాన్‌మసాలా తయారీ, విక్రయాలపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిషేధం విధించింది. పొగాకు ఉత్పత్తుల విక్రయం, నిల్వ, పంపిణీపై ఏడాది పాటు నిషేధం ఉంటుందని అధికారులు వెల్లడించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఉత్తర్వులు తీసుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు.
 
ప్రజారోగ్యం దృష్ట్యా ఆంక్షలు.. 

"ప్రజారోగ్య ప్రయోజనాల దృష్ట్యా, తెలంగాణ ప్రభుత్వం గుట్కా, పాన్ మసాలా తయారీ, నిల్వ, పంపిణీ, రవాణా, అమ్మకాలను నిషేధించింది. ఈ నిషేధం మే 24, 2024 నుండి ఒక సంవత్సరం పాటు తెలంగాణ వ్యాప్తంగా అమలులో ఉంటుంది" అని నోటిఫికేషన్ లో వెల్లడించింది సర్కారు.

పాన్ మసాలా తినడం వల్ల నోటి క్యాన్సర్..  

గుట్కా, పాన్ మసాలా తినడం వల్ల నోటి క్యాన్సర్, సబ్‌మ్యూకస్ ఫైబ్రోసిస్ , వంటి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

  ఇది కూడా చదవండి.. చిన్నపిల్లల్లో ఆస్తమా చికిత్స..? 

 ఇది కూడా చదవండి.. హార్ట్ హెల్త్ కోసం బెస్ట్ ఫుడ్ 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.