గోరఖ్‌పూర్ జూలో బర్డ్ ఫ్లూ దర్యాప్తు ముమ్మరం : 50 నమూనాలతో పరీక్షలకు పంపిన బృందం..  

షేర్ చేయండి:
గోరఖ్‌పూర్ జూలో బర్డ్ ఫ్లూ దర్యాప్తు ముమ్మరం : 50 నమూనాలతో పరీక్షలకు పంపిన బృందం..  

సాక్షి లైఫ్ : ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జూలో బర్డ్ ఫ్లూ కలకలం కొనసాగుతోంది. తాజాగా, సెంట్రల్ జూ అథారిటీ (సిజెడ్ఏ) ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం జూ లోపల, వెలుపల కలిపి మొత్తం 50 నమూనాలను సేకరించి పరీక్షల కోసం పంపింది. మరో కాకి మరణించినట్లు గుర్తించడంతో, దాని నమూనాను కూడా పరిశోధనకు పంపారు. ఈ పరీక్ష ఫలితాలను బట్టి జూను తిరిగి తెరిచే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

 

ఇది కూడా చదవండి..పేస్‌మేకర్ హార్ట్ పేషెంట్లకు ఎప్పుడు అవసరం..?

ఇది కూడా చదవండి..గుండె జబ్బులు రాకుండా ఉండడానికి వైద్య నిపుణులు చెప్పిన చిట్కాలు..

ఇది కూడా చదవండి..గుండె స్పందన తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు..

 

 శాస్త్రవేత్తలతో కూడిన బృందం.. 

బర్డ్ ఫ్లూ వ్యాప్తిపై సమాచారం అందిన వెంటనే సిజెడ్ఏ నియమించిన వైద్యులు, శాస్త్రవేత్తలతో కూడిన బృందం సోమవారం గోరఖ్‌పూర్‌కు చేరుకుంది. ఢిల్లీలోని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ విజయ్ కుమార్ టియోటియా, భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ యానిమల్ డిసీజెస్ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ మనోజ్ కుమార్, బరేలీలోని ఐవిఆర్‌ఐ వైల్డ్‌లైఫ్ హెడ్ డాక్టర్ ఎం పావాడే, సీనియర్ పాథాలజిస్ట్ డాక్టర్ ఎం కరికాలన్‌లతో కూడిన ఈ నలుగురు సభ్యుల దర్యాప్తు కమిటీ, తమ పనిని వేగవంతం చేయడానికి రెండు బృందాలుగా విడిపోయింది.

 నమూనాల సేకరణ..  

మొదటి బృందం భోపాల్, IVRI నుంచి వచ్చిన నిపుణులతో కూడి, రోజంతా జూ వెలుపల, ప్లానిటోరియం ఆనుకుని ఉన్న ప్రాంతాలతో సహా, జంతువులు, పక్షుల విసర్జనలను సేకరించింది. రెండవ బృందం ఢిల్లీ ,బరేలీ నుంచి వచ్చిన నిపుణులతో కూడిన టీమ్, జూ లోపల ఉన్న వన్యప్రాణులు, పక్షులు, అలాగే వాటి తాగు, స్నానపు చెరువుల నుండి నీటి నమూనాలను సేకరించింది.

ఇది కూడా చదవండి..హిమోగ్లోబిన్‌ పెంచే బెస్ట్ ఫుడ్..?

ఇది కూడా చదవండి..కొత్తిమీర ఆరోగ్యానికి ఒక అద్భుతమైన ఔషధం..

ఇది కూడా చదవండి..గుండె జబ్బులు పెరగడానికి ఇవే కారణం..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.