కేరళలో బర్డ్ ఫ్లూ.. అప్రమత్తమైన తమిళనాడు..   

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : కేరళలోని పలు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. కేరళలో విజృంభిస్తున్న నేపథ్యంలో పొరుగు రాష్ట్రమైన తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. దీన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచింది. ఒక్కో చెక్‌పోస్టు వద్ద 12 మంది పోలీసులను మోహరించి తమిళనాడుకు వచ్చే అన్ని వాహనాలను తనిఖీ చేస్తున్నారు.

 ఇది కూడా చదవండి.. ఈ సూపర్ ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యానికి డోకా ఉండదు.. 

కేరళలో విజృంభిస్తున్న నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రమైన తమిళనాడు  అప్రమత్తమైంది. అందులోభాగంగా ఆనైకట్టి, గోపాలపురం, వాళయార్ ప్రాంతాల్లో నిఘా పెంచాలని ప్రభుత్వం ఆదేశించింది. 

 ఇది కూడా చదవండి.. WHO Report : ఈ వ్యాధి ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతోంది.. 

  చెక్‌పోస్టుల వద్ద పోలీసుల తనిఖీలు..  

ఈ ప్రాంతాల్లోని ఒక్కో చెక్‌పోస్టు వద్ద 12 మంది పోలీసు అధికారులను నియమించామని, తమిళనాడుకు వచ్చే అన్ని వాహనాలను తనిఖీ చేస్తున్నామని అక్కడి అధికారులు చెప్పారు. పొరుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదవుతూండడంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని పశుసంవర్ధక అధికారులు చెబుతున్నారు.

రాష్ట్రంలోకి ఈ వాహనాల ప్రవేశంపై నిషేధం.. 

సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన తనిఖీ బృందంలో వెటర్నరీ డాక్టర్లు, పారామెడికల్ టీం సభ్యులు ఉన్నారని, వారు క్షుణ్ణంగా అన్నీ  పరిశీలిస్తున్నారని అధికారులు తెలిపారు. పౌల్ట్రీ, జంతువులను ఎక్కించుకున్న వాహనాలను చెక్‌పోస్టు దాటనివ్వబోమని వారు వెల్లడిస్తున్నారు.

కేరళలో 21,000 బాతులు..  

కేరళ రాష్ట్రసరిహద్దులోని కోయంబత్తూరు జిల్లాలో 1200కు పైగా పౌల్ట్రీ ఫారాలు ఉన్నాయని, దీని కారణంగా రాష్ట్రంలో ఎలాంటి వ్యాప్తి చెందకుండా ఆరోగ్య శాఖ అదనపు జాగ్రత్తలు తీసుకుంటోంది. అలప్పుజా జిల్లాలోని ఎడతువా, చెరుతునాలో కేరళ ఆరోగ్య శాఖ 21 వేల బాతులను చంపి ఖననం చేశారు.

ఇది కూడా చదవండి.. న్యూ స్టడీ : యువతలో క్యాన్సర్ వేగంగా పెరగడానికి కారణాలు ఇవే.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.