యువత ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్‌కు సంబంధం లేదని వెల్లడించిన ఐసీఎంఆర్-ఎయిమ్స్ నివేదిక
సాక్షి లైఫ్ : కరోనా వ్యాక్సిన్ కారణంగా యువత ఆకస్మిక మరణాలకు గురవుతున్నారనే ప్రచారంపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అండ్ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సంయుక్తంగా చేపట్టిన లోతైన పరిశోధన ద్వారా పుకార్లకు తెరదించాయి. కోవిడ్ వ్యాక్సిన్‌కు ఆకస్మిక మరణాలకు ఎటువంటి సంబంధం లేదని తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కూడా ఈ వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమని, దీని వల్ల ఎలాంటి ప్రమాదం లేదని పునరుద్ఘాటించింది. శాస్త్రీయ ఆధారాల ప్రకారం, ఆకస్మిక మరణాలకు వ్యాక్సిన్‌ను కారణమని చెప్పే అంశాలు ఏవీ వెలుగులోకి రాలేదని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ప్రకటించింది.
వ్యాక్సిన్ సురక్షితం, దుష్ప్రభావాలు అత్యల్పం: ఐసీఎంఆర్..
భారతదేశంలో వినియోగించిన కోవిడ్ వ్యాక్సిన్‌లు సురక్షితమైనవి మాత్రమే కాకుండా, వ్యాధి నివారణలోనూ అత్యంత ప్రభావవంతమైనవని ఐసీఎంఆర్ అండ్ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్ సీడీసీ) చేపట్టిన పరిశోధనలు తేల్చిచెప్పాయి. తీవ్రమైన దుష్ప్రభావాల కేసులు చాలా తక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
వ్యాక్సిన్‌ను ఆకస్మిక మరణాలకు ఆపాదించే చర్చలు నిరాధారమైనవని, తప్పుదోవ పట్టించేవని నిపుణులు స్పష్టం చేశారు. ఈ నివేదికతో, కోవిడ్ వ్యాక్సిన్ భద్రతపై నెలకొన్న ఆందోళనలు తొలగిపోయి, ప్రజలు మరింత ధైర్యంగా టీకా తీసుకోడానికి మార్గం సుగమమైంది.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
