ప్రయోగాలు ఎలుకలపైనే ఎందుకు జరుగుతాయో తెలుసా..?   

షేర్ చేయండి:
ప్రయోగాలు ఎలుకలపైనే ఎందుకు జరుగుతాయో తెలుసా..?   

సాక్షి లైఫ్ : శాస్త్రవేత్తలు ఎలుకలపై, ముఖ్యంగా మందులపై కూడా ప్రయోగాలు చేస్తారని మీకు తెలుసు. మార్కెట్‌లోని ఏదైనా కొత్త ఔషధం లేదా వ్యాక్సిన్  మొదటి ట్రయల్ ఎలుకలపై మాత్రమే చేస్తారు. తద్వారా దాని ప్రయోజనాలు, దుష్ప్రభావాలు తెలుసుకుంటారు పరిశోధకులు. ఎలుకలపై చేసిన ప్రయోగం విజయవంతమైనప్పుడు మాత్రమే సాధారణ ప్రజలు దానిని ఉపయోగించడానికి అనుమతిస్తారు శాస్త్రవేత్తలు. ఈ రోజు ప్రపంచ ఎలుకల దినోత్సవం సందర్భంగా ఎలుకలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.. 

ఎలుకలు మానవులకు వచ్చిన మాదిరిగానే అనేక వ్యాధులు సోకుతాయి. ఒకే రకమైన శారీర భాగాలను కలిగి ఉంటాయి. మాంసకృత్తుల కోసం కోడ్ చేసే 95శాతం జన్యువులు మనుషులు, ఎలుకలలో ఒకేలా ఉంటాయి. పరిశోధకులు ఎలుకలను మానవులతో పోల్చి సారూప్యతలు లేదా తేడాలు (ఉదాహరణకు లక్షణాలు లేదా డీఎన్ ఏ మార్పులు) వైద్యపరంగా ముఖ్యమైనవిగా ఉండవచ్చు.

ఇది కూడా చదవండి..  ఎండాకాలంలో వీటిని తప్పనిసరిగా నివారించాలి..

ఎలుకల జీవితకాలం 2 నుంచి7 సంవత్సరాలు. కాబట్టి రోగాలకు కారణాలు తెలుసుకోవడానికి, అధ్యయనం చేయడానికి వ్యాధుల పురోగతిని విశ్లేషించడానికి ఎలుకలనే ఎంచుకుంటారు శాస్త్రవేత్తలు.

- ఎలుకల ముందు దంతాలు చాలా వేగంగా పెరుగుతాయి. దీనివల్ల గోడలు, ఇటుకలు, సిమెంటు వంటి వాటిని పళ్లతో కోరుకుతాయి. ఎలుకలు వస్తువులను కొరుకకపోతే, వాటి దంతాలు సంవత్సరంలో 1 నుంచి 2 అంగుళాలు పెరుగుతాయి.

 - ఎలుకలు జ్ఞాపకశక్తిని కలిగి ఉంటాయి. ఒక్కసారి వెళ్లిన మార్గాన్ని చూస్తే , ఆ తర్వాత దాన్ని మర్చిపోవు.

- ఎలుకలు మానవులకు 30 కంటే ఎక్కువ వ్యాధులను కలిగిస్తాయి. ఈ వ్యాధులలో ప్లేగు అత్యంత ప్రాణాంతకమైనది.

- ఎలుకలు గుంపులుగా జీవించడానికి ఇష్టపడతాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. తమ గుంపులోని ఎలుక ఏదైనా జబ్బుపడినా, గాయపడినా వాటి సంరక్షణ కూడా తీసుకుంటాయి. 

- ఎలుకలు స్విమ్మింగ్‌లో కూడా ఎక్స్ పర్ట్స్. ఇవి లోతైన నీటిలో కూడా సులభంగా ఈదుతాయి.

పిల్లిలాగా, ఎలుక శరీరం కూడా చాలా సరళంగా ఉంటుంది. 50 అడుగుల ఎత్తు నుంచి పడిపోయినా వాటికి ఎలాంటి గాయాలు కావు.

ఇది కూడా చదవండి.. నిద్రించే విధానం కారణంగా వృద్ధాప్యం.. సరికొత్త అధ్యయనంలో వెల్లడి..

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.