నిద్రించే విధానం కారణంగా వృద్ధాప్యం.. సరికొత్త అధ్యయనంలో వెల్లడి..
సాక్షిలైఫ్: మీరు మీ వయస్సు కంటే ఎక్కువ వయస్సు ఉన్నట్లు కనిపిస్తున్నారా..? ఐతే అందుకు కారణం.. నిద్రంచే విధానమే. స్లీపింగ్ పొజిషన్ సరిగా లేకుంటే.. ప్రస్తుత వయస్సు కంటే10 సంవత్సరాలు పెద్దగా కనిపిస్తారని ఓ అధ్యయనంలో వెల్లడైంది. అంతే కాకుండా సరైన విధానంలో నిద్రించకపోతే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో కూడా నిపుణులు తెలిపారు. ఇప్పుడు ఆ విషయాలు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి.. రోజూ మిల్లెట్స్ తింటున్నారా..?
ఎక్కువ వయస్సు ఉన్నట్లు..
రాంగ్ పొజిషన్ లో నిద్రించడం కారణంగా నడుము నొప్పి, గర్భాశయ, వెన్నునొప్పి ,డిస్క్ సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని అధ్యయనంలో తేలింది. ఎక్కువ కాలం యవ్వనంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. నేటి అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లతోపాటు రాంగ్ పొజిషన్‌లో పడుకోవడం వల్ల తొందరగా వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తాయని పరిశోధకులు నిర్ధారించారు. స్వీడన్‌లోని స్టాక్‌హోమ్ విశ్వవిద్యాలయం నుంచి ఒక అధ్యయనం వెలువడింది. ఇందులో ప్రస్తుత వయస్సు కంటే ఎక్కువ వయస్సు ఉన్నట్లు భావించడానికి ప్రధాన కారణం రాంగ్ పొజిషన్లో నిద్రించడమే ప్రధాన కారణమని తేలింది.
సోమరితనం, అలసట, బలహీనత వెనుక కారణం ఇదే..
మీరు రోజంతా బద్ధకంగా, అలసటగా, బలహీనంగా ఉండడానికి సరైన పద్ధతిలో నిద్రించకపోవడమే అసలు కారణమని స్టాక్‌హోమ్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. ఈ పరిస్థితి మంచి నిద్రను దూరం చేయడమే కాకుండా, నడుము నొప్పి, గర్భాశయ, వెన్నునొప్పి వంటి సమస్యలను కలిగిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
నిద్రించేటప్పుడు పడుకునే విధానమే..
స్లీపింగ్ పొజిషన్ తప్పుగా ఉంటే10 సంవత్సరాల కంటే ముందే ముసలివాళ్లలా కనిపిస్తారని స్టాక్‌హోమ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు అంటున్నారు. వయస్సు విషయంలో నిద్ర భంగిమ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని, రాంగ్ పొజిషన్ లో పడుకోవడం వల్ల నిద్ర నాణ్యత దెబ్బతినడమే కాకుండా, వయస్సు కంటే 5 నుంచి 10 సంవత్సరాలు పెద్దగా కనిపిస్తారని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. ఎండాకాలంలో వీటిని తప్పనిసరిగా నివారించాలి..
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
