Fake ORS & Energy Drinks: మార్కెట్లో దొరికే ఫేక్ ఓ ఆర్ ఎస్, ఎనర్జీ డ్రింక్స్ తో ప్రాణాల మీదకు తెచ్చుకోకండి..! : పీడియాట్రీషియన్ డాక్టర్ శివరంజని

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : పిల్లలు డీహైడ్రేషన్ బారిన పడినప్పుడు తల్లిదండ్రులు చేసే చిన్న పొరపాటు ప్రాణాంతకం కావచ్చు. ప్రస్తుతం ఫార్మసీల్లో విక్రయించే కొన్ని పానీయాల బ్రాండింగ్ తీరుపై ప్రముఖ పీడియాట్రీషియన్ డాక్టర్ శివరంజని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 'eRZL' వంటి కమర్షియల్ డ్రింక్స్, పాత 'ORSL' బ్రాండ్‌ను గుర్తుకు తెచ్చేలా ఉండటం పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

గందరగోళానికి గురిచేస్తున్న బ్రాండింగ్.. 

సాధారణంగా అతిసారం లేదా వాంతులు అయినప్పుడు వైద్యులు ORS (Oral Rehydration Salts) వాడమని సూచిస్తారు. అయితే మార్కెట్లో లభించే ORSL లేదా కొత్తగా వచ్చిన eRZL వంటివి కేవలం 'ఎనర్జీ డ్రింక్స్' మాత్రమే. ఇవి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం తయారు చేసిన వైద్యపరమైన ORS కావు.

 డాక్టర్ శివరంజని లేవనెత్తిన ప్రధానాంశాలు..

 eRZL అనేది పాత ORSL బ్రాండ్‌ను గుర్తుకు తెచ్చేలా ఉంది. దీనివల్ల వినియోగదారులు ఇది కూడా మెడికల్ సొల్యూషన్ అని పొరబడే అవకాశం ఉంది. ఫార్మసీలలో అత్యవసర స్థితిలో ఉన్న తల్లిదండ్రులు, తెలిసిన పేర్లు లేదా రంగులను చూసి వీటిని కొనుగోలు చేస్తారు. ఇది అసలైన వైద్య చికిత్సకు ఆటంకం కలిగిస్తుంది.వీటిలో ఉండే 'సుక్రలోజ్' వంటి కృత్రిమ తీపి పదార్థాలు చిన్నపిల్లల ఆరోగ్యంపై, ముఖ్యంగా దీర్ఘకాలికంగా వాడితే దుష్ప్రభావం చూపే అవకాశం ఉందని గ్లోబల్ హెల్త్ గైడ్‌లైన్స్ చెబుతున్నాయి.

న్యాయపోరాటం ఎందుకు..?

ఈ అంశంపై గొంతు ఎత్తినందుకు సదరు కంపెనీల నుంచి తనకు లీగల్ నోటీసులు అందాయని డాక్టర్ శివరంజని తెలిపారు. "ఇది కేవలం ఒక కంపెనీతో గొడవ కాదు.. ప్రజారోగ్యం కోసం చేస్తున్న పోరాటం. వైద్యులు సామాజిక బాధ్యతతో సమస్యలను ఎత్తిచూపినప్పుడు వారిని అడ్డుకోవడం సరికాదు," అని ఆమె స్పష్టం చేశారు.

డిమాండ్లు ఏంటంటే..? 

రీబ్రాండింగ్: eRZL బ్రాండ్, పాత ORSLతో ఎలాంటి సంబంధం లేకుండా పూర్తిగా కొత్త రూపంలో ఉండాలి. ఫార్మసీలలో మెడికల్ ORS, కమర్షియల్ డ్రింక్స్ మధ్య స్పష్టమైన వ్యత్యాసం కనిపించేలా చర్యలు తీసుకోవాలి.

 

కఠిన నిబంధనలు.. 

ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇచ్చే కంపెనీలపై FSSAI కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కఠిన చర్యలు చేపట్టాలి. డీహైడ్రేషన్ సమయంలో ప్యాకెట్‌పై "WHO Recommended Formula" అని ఉన్న ORS పౌడర్ ని మాత్రమే వాడండి. రంగురంగుల సీసాల్లో దొరికే డ్రింక్స్ అన్ని వైద్యపరమైన ORS కాదని గుర్తుంచుకోండి.

ప్రజారోగ్యం దృష్ట్యా ఈ పిటిషన్‌కు మద్దతు తెలపాలని, సమాచారాన్ని పంచుకోవాలని డాక్టర్ శివరంజని కోరుతున్నారు. చిన్న గందరగోళం కూడా ప్రాణాల మీదకు తెచ్చే ప్రమాదం ఉన్నందున, ఎంపికలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. ప్రీ-మెనోపాజ్ కారణంగా ఎలాంటి సమస్యలు వస్తాయి..? అవేంటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.