Gandhi Hospital Doctors : గాంధీ ఆస్పత్రి వైద్యుల ఘనత..క్యాన్సర్ గడ్డను తొలగించిన వైద్య బృందం..

షేర్ చేయండి:
Gandhi Hospital Doctors : గాంధీ ఆస్పత్రి వైద్యుల ఘనత..క్యాన్సర్ గడ్డను తొలగించిన వైద్య బృందం..

సాక్షి లైఫ్ : సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి వైద్యులు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసి ఒక మహిళకు పునర్జన్మ ప్రసాదించారు. కిడ్నీ నుంచి శరీరంలోని ప్రధాన రక్తనాళానికి వ్యాపించిన క్యాన్సర్ గడ్డను తొలగించి వైద్య బృందం అరుదైన ఘనత సాధించింది. హైదరాబాద్‌కు చెందిన 41 ఏళ్ల మహిళ కిడ్నీ సంబంధిత క్యాన్సర్‌తో బాధపడుతూ గాంధీ ఆస్పత్రిలో చేరారు.

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..

ప్రాణాపాయ స్థితిలో ఉన్నరోగిని రక్షించిన వైద్యులు..

హైదరాబాద్‌కు చెందిన 41 ఏళ్ల మహిళ కిడ్నీ సంబంధిత క్యాన్సర్‌తో బాధపడుతూ గాంధీ ఆస్పత్రిలో చేరారు. పరీక్షల్లో ఆమె కుడి కిడ్నీలోని క్యాన్సర్ గడ్డ అత్యంత ప్రమాదకరంగా మారి, శరీరంలోని అతిపెద్ద రక్తనాళం అయిన 'ఇన్ఫీరియర్ వెనా కావా' (IVC)కి కూడా వ్యాపించినట్లు వైద్యులు గుర్తించారు. వైద్య పరిభాషలో దీనిని 'ట్యూమర్ థ్రాంబస్' అని పిలుస్తారు, ఇది క్యాన్సర్‌లో అత్యంత క్లిష్టమైన దశ.

 
గాంధీ ఆస్పత్రి యూరాలజీ విభాగం హెడ్ డాక్టర్ జి. రవిచందర్ నేతృత్వంలోని బృందం, ఉస్మానియా ఆస్పత్రికి చెందిన సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సి.హెచ్. మధుసూదన్‌తో కలిసి ఈ ఆపరేషన్ నిర్వహించారు.

నెఫ్రెక్టమీ చేసి డాక్టర్లు క్యాన్సర్ సోకిన కుడి కిడ్నీని పూర్తిగా తొలగించారు. థ్రాంబెక్టమీ ద్వారా ప్రధాన రక్తనాళం లోపలికి వ్యాపించిన క్యాన్సర్ గడ్డను (IVC Thrombectomy) వెలికితీశారు.
అనతంరం రక్తనాళానికి (IVC Repair) మరమ్మతులు చేసి, రక్తప్రసరణ సాధారణ స్థితికి వచ్చేలా చేశారు.

ప్రత్యేక నైపుణ్యంతో..

సాధారణంగా ఇలాంటి క్లిష్టమైన శస్త్రచికిత్సలు కార్పొరేట్ ఆస్పత్రుల్లో భారీ ఖర్చుతో కూడుకున్నవి. అయితే, ప్రభుత్వ ఆస్పత్రిలోనే అత్యాధునిక నైపుణ్యంతో ఈ చికిత్సను విజయవంతం చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ ఆపరేషన్ కోసం ప్రత్యేకంగా విచ్చేసి సహకరించిన డాక్టర్ మధుసూదన్ సేవలను డాక్టర్ రవిచందర్ ఈ సందర్భంగా కొనియాడారు. ప్రస్తుతం రోగి కోలుకుంటున్నట్లు వైద్యులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.