సాక్షి లైఫ్ : ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది క్యాన్సర్ వంటి మహమ్మారితో బాధపడుతున్నారు. సరైన సమయంలో చికిత్స అందకపోవడంతో తనువుచాలిస్తున్నారు. అయితే ఈ ప్రమాదకరమైన వ్యాధి నుంచి బయటపడేందుకు ఓ ఔషధాన్ని కనుగొన్నట్లు వైద్యులు ప్రకటించారు. టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ)కు చెందిన వైద్యులు క్యాన్సర్ చికిత్సకు ఓ ఔషధాన్ని తయారు చేశారు. టీఎంసీలోని వైద్యులు చేసిన పరిశోధనలో, క్యాన్సర్ కణాలను పెరగకుండా నిరోధించడానికి ఓ టాబ్లెట్ ను తయారుచేశారు. విశేషమేమిటంటే ఆ టాబ్లెట్ ధర కూడా చాలా తక్కువ ధరకే అందించనున్నట్లు టీఎంసీ డాక్టర్లు వెల్లడించారు.
ఈ టాబ్లెట్ క్యాన్సర్‌ను నివారిస్తుందా..?
టాటా మెమోరియల్ సెంటర్ డైరెక్టర్ డా.రాజేంద్ర బద్వే మాట్లాడుతూ.. టాటా మెమోరియల్ హాస్పిటల్ తన కొత్త పరిశోధన ద్వారా క్యాన్సర్ చికిత్స దుష్ప్రభావాలను తగ్గించడానికి అలాగే క్యాన్సర్ పునరావృతం కాకుండా నిరోధించడానికి ఒక పరిష్కార మార్గాన్ని కనుగొంది." అన్నారు. " కేవలం రూ.100 ఖరీదు చేసే టాబ్లెట్‌ను అభివృద్ధి చేసింది. దాదాపు దశాబ్ద కాలంగా టాటా వైద్యులు ఈ ట్యాబ్లెట్ కోసం శ్రమిస్తున్నారని, ఈ ఔషధం జూన్-జూలైలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నుంచి ఆమోదం పొందే అవకాశం ఉంది."అని డా.రాజేంద్ర బద్వే పేర్కొన్నారు.
క్యాన్సర్ మళ్లీ రాకుండా..
ఈ టాబ్లెట్ కీమోథెరపీ వంటి చికిత్సల దుష్ప్రభావాలను 50 శాతం తగ్గించడంలో క్యాన్సర్ పునరావృత అవకాశాలను 30శాతం తగ్గించడంలో సహాయపడుతుందని టీఎంసీకి చెందిన డాక్టర్ తెలిపారు. ఈ ఔషధాన్ని చౌకైన, అత్యంత ప్రభావవంతమైనదిగా వైద్యులు చెబుతున్నారు. కీమోథెరపీ, రేడియోథెరపీ తర్వాత చనిపోతున్న క్యాన్సర్ కణాలు సెల్-ఫ్రీ క్రోమాటిన్ కణాలను విడుదల చేస్తాయని ఈ పరిశోధన కనుగొంది, ఇది ఆరోగ్యకరమైన కణాలను క్యాన్సర్‌గా మారుస్తుందని గుర్తించింది.
టాబ్లెట్ ఎలా పనిచేస్తుందంటే..?
ఇది కూడా చదవండి.. సమ్మర్ లో వేడి చేస్తోందా..? ఇది మీకోసమే..!
క్యాన్సర్ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు వైద్యులు ఎలుకలకు రెస్వెరాట్రాల్, కాపర్ (ఆర్+క్యూ)తో కూడిన ప్రో-ఆక్సిడెంట్ మాత్రలు ఇచ్చారు. R+Cu ఆక్సిజన్ రాడికల్‌లను ఉత్పత్తి చేస్తుంది, ఇవి ఈ క్రోమాటిన్ కణాలను నాశనం చేసినట్లు గుర్తించారు పరిశోధకులు.
మౌఖికంగా ఇచ్చినప్పుడు, టాబ్లెట్ కడుపులో ఆక్సిజన్ రాడికల్స్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి రక్తంలో కూడా వేగంగా కలిసిపోతాయి. రక్త ప్రసరణలోకి విడుదలయ్యే ఆక్సిజన్ రాడికల్స్ క్రోమాటిన్ కణాలను నాశనం చేస్తాయి. 'మెటాస్టాసిస్'ను నిరోధిస్తాయి. క్యాన్సర్ కణాలను శరీరంలోని ఒక భాగం నుంచి మరొక భాగానికి తరలించడంతోపాటు, R+Cu కీమోథెరపీ టాక్సిసిటీని కూడా నిరోధిస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు.
ఈ ఔషధం ఎప్పటికి అందుబాటులోకి వస్తుంది..?
"ఈ ఔషధాన్ని క్యాన్సర్ చికిత్సలో ఎలా పనిచేస్తుందనేది తెలుసుకోవడానికి ఇప్పటివరకు కేవలం ఎలుకలపై మాత్రమే పరీక్షించారు. మనుషులపై కూడా ఈ మందును ప్రయోగించి, మార్కెట్లోకి ఈ ఔషధాన్ని తీసుకురావడానికి దాదాపు ఐదు సంవత్సరాలు పడుతుందని వైద్యులు చెబుతున్నారు.
ఈ కొత్త ఔషధం ప్రయోజనాన్ని పొందడానికి కొన్ని సంవత్సరాలు వేచి ఉండవలసి ఉంటుంది. ఇంతకు ముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా రష్యా శాస్త్రవేత్తలు క్యాన్సర్ వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేస్తున్నారని, ఇది త్వరలో రోగులకు అందుబాటులో ఉంటుందని ప్రకటించారు.
ఇది కూడా చదవండి.. ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు కావాలంటే..ఈ విత్తనాలు తినాలి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com