సాక్షి లైఫ్ : మిర్యాలగూడలో కంటి వెలుగునిచ్చే వైద్యం పేరుతో సామాన్య ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న భారీ రాకెట్‌ను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (TGMC) అధికారులు బట్టబయలు చేశారు. నిపుణులైన వైద్యులు లేకుండానే శస్త్రచికిత్సలు, నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న ఎనిమిది ప్రైవేట్ కంటి ఆసుపత్రులపై అధికారులు కొరడా ఝుళిపించారు.
ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..?
ఇది కూడా చదవండి...కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?
చీటింగ్ ఎలా జరిగింది..?
జిల్లా ఆరోగ్య శాఖ నుంచి అనుమతులు పొందే సమయంలో అర్హులైన నేత్ర వైద్యుల (Ophthalmologists) పేర్లను చూపించి, క్షేత్రస్థాయిలో మాత్రం కేవలం టెక్నీషియన్లతోనే వైద్యం చేయిస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. అనుమతుల్లో పేర్కొన్న అసలైన వైద్యులు హైదరాబాద్ వంటి నగరాల్లో ప్రాక్టీస్ చేస్తుండగా, ఇక్కడ ఆప్టోమెట్రీ, ఆప్తాల్మాలజీ టెక్నీషియన్లే డాక్టర్ల అవతారమెత్తి రోగులకు మందులు ప్రిస్క్రిబ్ చేయడం, అధునాతన పరీక్షలు నిర్వహించడం, చివరికి ఆపరేషన్లు కూడా చేస్తున్నట్లు గుర్తించారు.
నిందితులు, ఆసుపత్రులు..
ఈ అక్రమాలకు పాల్పడుతున్న ఐదుగురు టెక్నీషియన్లను (నాగేష్, వాకే శ్రీను, నాగరాజు, శివ కోటేశ్వరరావు, వెంకటేష్, వికాస్ కుమార్) పోలీసులు అరెస్ట్ చేశారు. కింది ఆసుపత్రులలో ఈ ఉల్లంఘనలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు:
శ్రీ వేంకటేశ్వర (SV) ఐ హాస్పిటల్
శ్రీ మహాలక్ష్మి ఐ హాస్పిటల్
అన్నపూర్ణ నేత్రాలయం
యశస్వి ఐ హాస్పిటల్
షాలిని ఐ క్లినిక్
రాఫా విజన్ కేర్ సెంటర్
శివ సాయి ఐ హాస్పిటల్
వైద్యులపై కఠిన చర్యలు..
తమ పేర్లను వాడుకోవడానికి సహకరించిన డాక్టర్లు శ్రీకుమార్, ప్రభు చైతన్య, ఎం. భరత్ భూషణ్, కె. వెంకటేశ్వర్లుకు మెడికల్ కౌన్సిల్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వీరి వివరణ సంతృప్తికరంగా లేకపోతే మెడికల్ లైసెన్సులను రద్దు చేయాలని కౌన్సిల్ యోచిస్తోంది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఇలాంటి నకిలీ వైద్యుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !
ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com