గుండెపోటుతో చనిపోయిన, కోలుకున్న సెలెబ్రెటీలు..  

షేర్ చేయండి:
గుండెపోటుతో చనిపోయిన, కోలుకున్న సెలెబ్రెటీలు..  

సాక్షి లైఫ్ : ముప్పై, నలభై , యాభైలలో గుండెపోటు చాలా మందిని ఆందోళనకు గురి చేస్తోంది. ఈ గుండెపోటు కారణంగా ఎంతోమంది ప్రముఖ నటులు ప్రాణాలు వదిలారు. బాలీవుడ్, టెలివిజన్ గ్లామరస్ ప్రపంచం చాలా ఒత్తిడితో కూడుకుని ఉంటుంది.  ప్రత్యేక ప్రదర్శనలివ్వడం, అభిమానులను పెంచుకోవడం, పేరు సంపాదించడం  వరకు, సృజనాత్మకతను జోడిస్తూ ప్రతిఒక్కరూ వారి కలల సాధన కోసం  ప్రతిరోజూ కష్టపడి పని చేయాల్సి ఉంటుంది.

 సినిమా రంగం , వ్యాపార రంగం.. ఏరంగమైనా చాలా మంది తమ రోజువారీ జీవితంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. జీవనశైలి వ్యాధుల వెనుక ఇది ఒక ముఖ్య కారణం స్ట్రెస్ కూడా ఒకటి. దీనికారణంగా గత కొన్ని సంవత్సరాలుగా, చాలా మంది సెలబ్రిటీలు గుండెపోటుతో చిన్న వయసులోనే తనువుచాలించగా మరికొందరు ఆయా సమస్య నుంచి బయటపడి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. 

గుండెపోటు కారణంగా..

ముప్పై, నలభై , యాభైలలో గుండెపోటు చాలా మందిని ఆందోళనకు గురి చేస్తోంది. ఈ గుండెపోటు కారణంగా ఎంతోమంది ప్రముఖ నటులు ప్రాణాలు వదిలారు. అలాంటి వారిలో కర్ణాటక సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్, బాలీవుడ్ సంగీత దర్శకుడు బప్పీలహరి, చిరంజీవి సర్జా,నటుడు సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ,ప్రముఖ గాయకుడు కెకె గా ప్రసిద్ధి చెందిన కృష్ణకుమార్ కున్నాత్, తెలుగు సినిమా పరిశ్రమలో నందమూరి తారకరత్న వంటి నటులు గుండె పోటుతోనే చనిపోయారు.  

చిరంజీవి సర్జా గుండెపోటుతో మరణించారు..
 
ప్రముఖ దక్షిణ భారత నటుడు చిరంజీవి సర్జా జూన్ 7, 2020న తుది శ్వాస విడిచారు. బెంగుళూరులో గుండెపోటుతో మరణించిన ఆయన వయసు కేవలం 35 సంవత్సరాలు. చిరంజీవి సర్జా చిన్నవయసులో మరణించడం చాలా బాధాకరం.  

సిద్ధార్థ్ శుక్లా.. 

సిద్ధార్థ్ శుక్లాకు 40 ఏళ్ల వయసులో గుండెపోటు వచ్చింది. ప్రముఖ టెలివిజన్ నటుడు సిద్ధార్థ్ శుక్లా నలభై ఏళ్ల వయసులో ప్రాణాలు కోల్పోయారు. ఈయన సెప్టెంబర్ 2, 2021న గుండెపోటుతో కన్నుమూశారు.
  
ప్రముఖ గాయకుడు కెకె.. 

కెకె 53 సంవత్సరాల వయస్సులో గుండెపోటు కారణంగా మరణించారు. ప్రముఖ గాయకుడు కెకె గా ప్రసిద్ధి చెందిన కృష్ణకుమార్ కున్నాత్, మే 31, 2022న గుండెపోటుకు గురయ్యారు. గురుదాస్ కోసం కోల్‌కతాలోని నజ్రుల్ మంచాలో ప్రదర్శన ఇచ్చిన తర్వాత ఆయన గుండెపోటుతో మరణించారు.  

నటుడు సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ..

ఈయన 46 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో మరణించాడు. సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ పందొమ్మిదేళ్ల వయసులో వినోద ప్రపంచంలో చేరారు. కేవలం 46 సంవత్సరాల వయస్సులో, అతను వ్యాయామశాలలో  కుప్పకూలిపోయాడు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా గుండెపోటు కారణంగా చనిపోయాడు. 
 
 రాజీవ్ కపూర్.. 

 రాజీవ్ కపూర్ 58 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు. కపూర్ తోబుట్టువులలో చిన్నవాడైన రాజీవ్ కపూర్ 58 సంవత్సరాల వయస్సులో కన్నుమూశాడు. ఆయన ఫిబ్రవరి 9, 2021న చెంబూర్‌లోని ఒక ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించాడు.  

 ప్రముఖ నటి సుస్మితా సేన్ 47 ఏళ్ల వయసులో గుండెపోటుకు గురయ్యారు..

ప్రముఖ బాలీవుడ్ నటి సుస్మితా సేన్, కేవలం 47 సంవత్సరాల వయస్సులో, ఫిబ్రవరి 2023లో గుండెపోటు వచ్చింది. తాను యాంజియోప్లాస్టీ ప్రక్రియ చేయించుకున్నానని, ఎలాంటి సమస్య లేకుండా గుండెలో స్టెంట్‌ను అమర్చినట్లు సుస్మిత అప్పట్లో సామజిక మాధ్యమం ద్వారా వెల్లడించింది. ఇప్పుడు ఆమె ఆరోగ్యంగా ఉన్నారు. 

సునీల్ గ్రోవర్ గుండెపోటుతో బాధపడుతూ నాలుగు బైపాస్ సర్జరీలు చేయించుకున్నాడు..

సునీల్ గ్రోవర్..  

ప్రముఖ హాస్యనటుడు, సునీల్ గ్రోవర్ 2022లో గుండెపోటుతో బాధపడ్డాడు. ఆయననాలుగు బైపాస్ సర్జరీలు చేయించుకున్న ఆయన వయస్సు కేవలం 45 ఏళ్లు. ఆతర్వాత ఆయన ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్‌లో చికిత్స పొందారు. ఏడు రోజుల శస్త్రచికిత్స తర్వాత, సునీల్ గ్రోవర్ డిశ్చార్జ్ అయ్యి ఇప్పుడు ఆరోగ్యంగా, సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాడు.

రెమో డిసౌజా.. 

ప్రఖ్యాత డ్యాన్స్ కొరియోగ్రాఫర్, రెమో డిసౌజా 2020లో గుండెపోటు వచ్చినప్పుడు అతని వయస్సు కేవలం 45 సంవత్సరాలు. అప్పుడు ఆయన కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ డిసెంబర్ 11, 2020న రెమో తన గుండె శస్త్రచికిత్స తర్వాత ఎప్పటిలాగే ఆరోగ్యాంగా ఉన్నాడు.

ఇది కూడా చదవండి.. హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటే..? లక్షణాలు..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.