హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటే..? లక్షణాలు..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : పాకిస్తాన్ కు చెందిన 17 ఏళ్ల టెన్నిస్ ప్లేయర్ జైనాబ్ అలీ నఖ్వీ చిన్నవయసులో హైపర్ట్రోఫిక్ కార్డియో మయోపతితో మరణించారు. ముప్పై, నలభై , యాభైలలో గుండెపోటు చాలా మందిని ఆందోళనకు గురి చేస్తోంది. హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటే ఏమిటి..? ఇది ఎలాంటి వారిలో వస్తుంది..? ఈ సమస్య రావడానికి ప్రధాన కారణాలు ఏంటి..? లక్షణాలు ఎలా ఉంటాయి..? అనేవి ఇప్పుడు తెలుసుకుందాం.. 

హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి (హెచ్ సీ ఎమ్) : ఈ పరిస్థితిలో గుండె 'ఎడమ జఠరిక' పరిమాణం పెరుగుతుంది. ఇది రక్త ప్రసరణపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. దీంతో అవయవాలకు రక్త సరఫరా ఆగిపోతుంది. ఇది ఏ వయస్సులోనైనా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది తీవ్రమైనది. ఈ సమస్య ఒక్కోసారి జన్యు పరివర్తన వల్ల కూడా సంభవించవచ్చు. ఈ సమస్య చాలా అరుదుగా వస్తుంది. ముందుగా లక్షణాలు కనిపించవు. 
 
హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది..?

హైపర్‌ట్రోఫిక్ కార్డియోమయోపతి అనేది గుండె కండరాలు లేదా మయోకార్డియం మందంగా మారడంతో ఎడమ జఠరికలో దృఢత్వం కారణంగా మిట్రల్ వాల్వ్‌లో మార్పులకు కారణమయ్యే సంక్లిష్టమైన గుండె జబ్బు అని వైద్యులు చెబుతున్నారు.

 హైపర్ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమయోపతికి దారి తీస్తుంది. ఈ పరిస్థితి మీ గుండె కండరాలలోని ఇతర భాగాలను దిగువ, కుడి జఠరిక లేదా మీ మొత్తం ఎడమ జఠరికలో అపెక్స్ వంటి వాటిని కూడా గట్టిపరుస్తుంది. రక్తం తక్కువగా ఉన్నందున, ఆక్సిజన్ అధికంగా ఉండే రక్తం అవయవాలకు, కండరాలకు పంప్ అవ్వదు, ఈ పరిస్థితి గుండె లోపల ఒత్తిడిని పెంచుతుందని నిపుణులు అంటున్నారు.

  ఈ లక్షణాలు..  

ఆకస్మిక ఛాతీ నొప్పి
ఊపిరి ఆడకపోవడం
మైకము లేదా మూర్ఛ
గుండె దడగా అనిపించడం

హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతికి కారణాలు..?

వారసత్వంగా.. 

తల్లిదండ్రుల నుంచి హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి వారసత్వంగా కూడా తల్లిదండ్రుల నుంచి పిల్లలకు రావచ్చని వైద్యులు అంటున్నారు. గుండె కండరాల లక్షణాలను కోడ్ చేసే జన్యువులో కొంత లోపం ఉంటేకూడా వస్తుంది. 500 మందిలో ఒకరికి మాత్రమే ఈ సమస్య వచ్చే అవకాశం ఉందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతోంది. కుటుంబంలో హైపర్‌ట్రోఫిక్ కార్డియోమయోపతి జన్యువులను కలిగి ఉన్నప్పటికీ  కొందరిలో ఈ సమస్య రాకపోవచ్చు

అధిక రక్త పోటు.. 

రక్తపోటులో ఆకస్మిక పెరుగుదల కూడా ఈ పరిస్థితికి కారణం కావచ్చు. హైబీపీ వల్ల కూడా తలెత్తవచ్చు. ముఖ్యంగా ఇది వృద్ధాప్యంలో వచ్చే అవకాశాలుంటాయని డాక్టర్లు చెబుతున్నారు. కొందరిలో వయస్సుతో సంబంధంలేకుండానే హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. 

ఇది కూడా చదవండి.. హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతితో టీనేజ్ పాకిస్తాన్ టెన్నిస్ ప్లేయర్ మృతి..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.