భారతదేశంపై హెచ్‌ఎంపీవీ వైరస్ 'డబుల్ ఎటాక్'..
సాక్షి లైఫ్ : భారత్‌లో హెచ్‌ఎంపీవీ వైరస్ చైనాలో విస్తరిస్తున్న హెచ్‌ఎంపీవీ వైరస్ భారత్‌లోనూ ప్రవేశించింది. బెంగళూరులో 8 నెలల చిన్నారితోపాటు 3నెలల చిన్నారికి హెచ్‌ఎంపీవీ వైరస్ సోకింది. దేశంలోనే మొదటి సారిగా కర్ణాటకలోనే రెండు కేసులు వెలుగులోకి వచ్చాయి. కర్ణాటకలో నమోదైన హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (హెచ్‌ఎంపీవీ)కి సంబంధించిన రెండు కేసులను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) గుర్తించింది.
డ్రాగన్ కంట్రీలో మొదలైన కొత్త వైరస్ హెచ్ ఎంపివి భారతదేశంలోనూ ప్రవేశించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) కర్ణాటకలో రెండు హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (హెచ్‌ఎంపీవీ) కేసులను గుర్తించింది.
ఇది కూడా చదవండి..స్ట్రోక్ ప్రమాదాన్ని కలిగించే 4 ఆహార పదార్థాలు..
ఇది కూడా చదవండి..ఎలాంటి వారిపై షింగిల్స్ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటుంది..?
ఇది కూడా చదవండి..స్ట్రోక్ కు ప్రధాన కారణాలు..? నివారణ ఎలా..?
హ్యూమన్ మెటానిమోవైరస్..
దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ, శ్వాస ఆడకపోవడం. ఈ వైరస్ బ్రోన్కైటిస్ లేదా న్యుమోనియా వంటి సమస్యలకు దారితీయవచ్చు. హ్యూమన్ మెటానిమోవైరస్(హెచ్ఎంపివి) శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే ఇతర వైరస్‌ల మాదిరిగానే ఉంటుంది. ఇన్ఫెక్షన్ సోకిన మూడు నుంచి ఆరు రోజుల తర్వాత దాని లక్షణాలు కనిపిస్తాయి. ఇది సాధారణంగా 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. ఒక్కసారి ఈ వైరస్ వస్తే రెండవసారి ఆయా లక్షణాలు మొదటిసారి వచ్చిన దానికంటే తీవ్రత తక్కువగా ఉంటుంది. ఈ వైరస్‌ను తొలిసారిగా 2001లో గుర్తించారు.
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
