కరోనా కేసులు కేరళలో అత్యధికం.. ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులు అంటే..?
సాక్షి లైఫ్ : భారత్‌లో కోవిడ్-19 కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,009కి చేరుకుంది. ఇందులో అత్యధికంగా కేరళలో కొత్త కేసులు నమోదయ్యాయి. తాజా గణాంకాల ప్రకారం, కేరళలో 430 యాక్టివ్ కేసులు నమోదై దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (209 యాక్టివ్ కేసులు), ఢిల్లీ (104 యాక్టివ్ కేసులు), గుజరాత్ (83 యాక్టివ్ కేసులు), తమిళనాడు (69 యాక్టివ్ కేసులు), కర్ణాటక (47 యాక్టివ్ కేసులు) ఉన్నాయి.
ఇది కూడా చదవండి..ప్రీక్లాంప్సియా అంటే ఏమిటి..? ఎలాంటి మహిళల్లో వస్తుంది..?
ఇది కూడా చదవండి..Thyroid problems : థైరాయిడ్ సమస్యకు ప్రధాన కారణాలు..?
ఇది కూడా చదవండి..జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది జబ్బుకు సంకేతం కావచ్చు..
అయితే, అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, అసోం, బీహార్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్ వంటి కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఎలాంటి కరోనా యాక్టివ్ కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఈ కేసుల పెరుగుదల నేపథ్యంలో, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ నిబంధనలను పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచుగా చేతులు శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం అవశ్యకం.
రాష్ట్రాల వారీగా కరోనా కేసుల పరిస్థితి..
ఇతర రాష్ట్రాల్లోనూ స్వల్పంగా కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో 15, రాజస్థాన్‌లో 13, పశ్చిమ బెంగాల్‌లో 12, పుదుచ్చేరిలో 9, హర్యానాలో 9, ఆంధ్రప్రదేశ్‌లో 4, మధ్యప్రదేశ్‌లో 2, ఛత్తీస్‌గఢ్‌లో 1, గోవాలో 1, తెలంగాణలో ఒక యాక్టివ్ కేసు రికార్డయ్యాయి.
కేరళ: 430 యాక్టివ్ కేసులు
మహారాష్ట్ర: 209 యాక్టివ్ కేసులు
ఢిల్లీ: 104 యాక్టివ్ కేసులు
గుజరాత్: 83 యాక్టివ్ కేసులు
కర్ణాటక: 47 యాక్టివ్ కేసులు
ఇది కూడా చదవండి..విటమిన్ b12 లోపిస్తే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి..?
ఇది కూడా చదవండి.. ఇన్‌స్టంట్ నూడుల్స్ సైడ్ ఎఫెక్ట్స్..
ఇది కూడా చదవండి.. సికిల్ సెల్ డిసీజ్ లక్షణాలు ఎలా వుంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
