Kidney Diseases : హైదరాబాద్‌లో పెరుగుతున్న కిడ్నీ డిసీజెస్: యువతకు ముప్పు..!

షేర్ చేయండి:
Kidney Diseases : హైదరాబాద్‌లో పెరుగుతున్న కిడ్నీ డిసీజెస్: యువతకు ముప్పు..!

సాక్షి లైఫ్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ప్రజారోగ్యాన్ని కలవరపరిచే కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఆఫ్ అనోన్ ఎటియాలజీ (CKDu) గా పిలిచే మూత్రపిండాల వ్యాధి (kidney disease) నగరంలో పెరుగుతున్నట్లు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (OGH) అండ్ అపోలో హాస్పిటల్స్‌కు చెందిన నెఫ్రాలజిస్టుల అధ్యయనంలో తేలింది.

ఇది కూడా చదవండి..అవకాడోతో కలిపి తినకూడని ఆహారపదార్థాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

 ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

యువకుల్లోనే..

 సాధారణంగా మధుమేహం (Diabetes) లేదా అధిక రక్తపోటు (High BP) ఉన్నవారిలోనే కిడ్నీ సమస్యలు కనిపిస్తాయి. అయితే, ఈ కొత్త అధ్యయనం ప్రకారం, హైదరాబాద్ నగరవాసులలో ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు లేని, ఆరోగ్యంగా ఉన్నయువకులలో (Young Urban Population) కూడా ఈ CKDu వ్యాధి తీవ్రంగా పెరుగుతోంది. ఇది వైద్య నిపుణుల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది.

కిడ్నీవ్యాధులకు ప్రధాన ప్రమాద కారకాలు..?  

ఈ మిస్టరీ కిడ్నీ వ్యాధికి కారణాలపై జరిపిన లోతైన పరిశోధనలో రెండు ప్రధాన ప్రమాద కారకాలుగా గుర్తించారు:

అదుపు లేని ఆయుర్వేద,హెర్బల్ మందులు: సరైన నియంత్రణ లేని, అశాస్త్రీయమైన హెర్బల్ ఔషధాల (Unregulated Herbal Medicines) వాడకం ఈ కిడ్నీ సమస్యలకు దారితీస్తున్నట్లు నిపుణులు వెల్లడిస్తున్నారు.

కిడ్నీవ్యాధి ప్రారంభ దశలో లక్షణాలు పెద్దగా తెలియకపోవడం, లేదా ఆలస్యంగా గుర్తించడం (Delayed Diagnosis) వల్ల చికిత్స కష్టమవుతోందని పరిశోధకులు చెబుతున్నారు.

కిడ్నీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని, చిన్న చిన్న లక్షణాలు కనిపించినా వెంటనే నెఫ్రాలజిస్ట్‌ను సంప్రదించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా, లైసెన్స్ లేని లేదా విశ్వసనీయత లేని హెర్బల్ మందులను వాడటం తక్షణమే ఆపాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.  

ఇది కూడా చదవండి.. క్యాన్సర్ మహమ్మారిపై పోరాడి గెలిచిన విజేత.. 

ఇది కూడా చదవండి.. కొత్తగా దంతాలు వచ్చిన పిల్లలకూ బ్రష్ చేయాలా..? 

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.