అవకాడోతో కలిపి తినకూడని ఆహారపదార్థాలు ఏమిటి..?

షేర్ చేయండి:
అవకాడోతో కలిపి తినకూడని ఆహారపదార్థాలు ఏమిటి..?

సాక్షి లైఫ్ : అవకాడోలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. జీర్ణక్రియను మెరుగుపరచడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి, మధుమేహాన్ని నియంత్రించడానికి, మెదడు ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి అవకాడోలు ఎంతో మేలు చేస్తాయి. అయితే అవకాడోతో  కొన్నిరకాల ఆహారపదార్థాలు తినకూడదు. అవి ఏమిటో చూద్దాం.

ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..  

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

  ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

 ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు..

అవకాడోలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. సాల్టీ ఫుడ్స్‌లోని సోడియం వీటితో కలిపి తింటే ఎలక్ట్రోలైట్ సమతుల్యతను దెబ్బతీస్తుంది అంతేకాదు జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.

 పాల ఉత్పత్తులు.. 

అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. జున్ను లేదా పాలు, ఇతర పాల ఉత్పత్తులు కూడా కొవ్వు కలిగి ఉంటాయి. కాబట్టి ఈ రెండూ కలిస్తే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

 పుల్లని పండ్లు.. 

అవోకాడోతో పాటు నారింజ,ద్రాక్ష వంటి పుల్లని పండ్లను తినడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.

తీపి పదార్థాలు.. 

అవకాడోలో చక్కెర తక్కువగా ఉంటుంది. కాబట్టి చక్కెర అధికంగా ఉండే ఆహారపదార్థాలు అవకాడోతో కలిపి తినకూడదు.

 ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలు..

ప్రొటీన్ ఫుడ్స్‌లోని కొవ్వు, అవకాడోలోని కొవ్వుతో కలిపి తీసుకుంటే  శరీరంలోని అధిక కొవ్వుకు దారి తీస్తుంది. కాబట్టి అవకాడోతో ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోకూడదు. 

 ప్రాసెస్ చేసిన ఆహారాలు..

అవకాడోలు ఆరోగ్యకరమైన కొవ్వులు. ప్రాసెస్ చేసిన ఆహారాలలో అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి రెండూ కలిపి తీసుకోవడం కూడా శరీరానికి మంచిది కాదు. అవకాడోతో కొవ్వు పదార్థాలు తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి.

ఇది కూడా చదవండి.. డెలివరీకి ముందు గర్భిణీలు "సీ" ఫుడ్ తినకూడదా..? 

ఇది కూడా చదవండి.. అధిక రక్తపోటు లక్షణాలు..? 

ఇది కూడా చదవండి.. మందులు లేకుండా అధిక రక్తపోటును నియంత్రించే మార్గాలు

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com