జిబిఎస్ వ్యాప్తితో అప్రమత్తమైన మహారాష్ట్ర.. 

షేర్ చేయండి:
జిబిఎస్ వ్యాప్తితో అప్రమత్తమైన మహారాష్ట్ర.. 

సాక్షి లైఫ్ : మహారాష్ట్ర గులియన్ బారీ సిండ్రోమ్ (జిబిఎస్) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పూణే జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో తగినంతగా మందులు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. ఈవ్యాధి సోకిన వారిలో ఆకస్మికంగా తిమ్మిరి, కండరాల బలహీనతకు కారణమయ్యే అరుదైన పరిస్థితి కనిపించడమేకాకుండా తీవ్రమైన బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి..హోమియోపతి ఔషధాలతో ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయా..? 

ఇది కూడా చదవండి..130కి పెరిగిన గులియన్ బారే సిండ్రోమ్ (జిబిఎస్) కేసులు.. 

ఇది కూడా చదవండి.. శరీరాన్ని సజావుగా నడపడంలో రక్తం పాత్ర ఏమిటి..? 

ఇది కూడా చదవండి.. మందులు లేకుండా అధిక రక్తపోటును నియంత్రించే మార్గాలు

 

గురువారం పూణేలో జరిగిన జిల్లా ప్రణాళిక కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించిన ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ జిబిఎస్ రోగుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేసే ఆసుపత్రులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఆరోగ్య అధికారులను ఆదేశించారు.

పూణే పరిసర ప్రాంతాలలో జిబిఎస్ వ్యాప్తి కలుషితమైన నీటి వనరులతో ముడిపడి ఉండవచ్చని, కలుషితమైన ఆహారం, నీటిలో కనిపించే క్యాంపిలోబాక్టర్ జెజుని అనే బ్యాక్టీరియా వ్యాప్తికి కారణమని చెబుతున్నారు వైద్యనిపుణులు.

ఇది కూడా చదవండి.. WHO Report : ఈ వ్యాధి ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతోంది.. 

ఇది కూడా చదవండి.. ఎండకాలంలో పసిపిల్లలు, బాలింతల ఆరోగ్యం కోసం..  

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.