Measles : బంగ్లాదేశ్‌లో 'మీజిల్స్' కలకలం.. 459కి చేరిన చిన్నారుల మరణాలు..!

షేర్ చేయండి:
Measles : బంగ్లాదేశ్‌లో 'మీజిల్స్' కలకలం.. 459కి చేరిన చిన్నారుల మరణాలు..!

సాక్షి లైఫ్ : పొరుగు దేశం బంగ్లాదేశ్‌ను 'తట్టు' (మీజిల్స్) మహమ్మారి వణికిస్తోంది. గత కొన్ని వారాలుగా అక్కడ ఈ వ్యాధి తీవ్రత ఊహించని స్థాయిలో పెరుగుతుండటంతో చిన్నారుల మరణాల సంఖ్య రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. గడిచిన 24 గంటల్లోనే తట్టు, దాని సంబంధిత లక్షణాలతో మరో ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ వ్యాప్తి ప్రారంభమైన ప్పటి నుంచి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 459కి చేరుకుందని స్థానిక ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

బంగ్లాదేశ్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) నివేదికల ప్రకారం.. తాజా మరణాలలో ఒకటి అధికారికంగా తట్టు వల్ల జరిగినట్లు నిర్ధారణ కాగా, మిగిలిన ఐదు మరణాలను అనుమానాస్పద కేసులుగా వర్గీకరించారు.

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

 ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు.. 

 

శరవేగంగా కేసుల పెరుగుదల.. 

బంగ్లాదేశ్‌లో ఈ ఆరోగ్య సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందో కింది గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి:

కేసుల ఉధృతి: గడిచిన 24 గంటల్లోనే 1,274 అనుమానాస్పద కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం అనుమానాస్పద కేసుల సంఖ్య 57,846కి చేరింది.

ల్యాబ్ నిర్ధారణ: కేవలం ఒక్క రోజులోనే 243 కొత్త కేసులు ల్యాబ్ పరీక్షల్లో నిర్ధారణ కాగా.. మొత్తం అధికారికంగా నిర్ధారించబడిన కేసుల సంఖ్య 7,767కి పెరిగింది.

హాస్పిటలైజేషన్: మార్చి మధ్య వారం నుంచి ఇప్పటివరకు దాదాపు 42,092 మంది చిన్నారులు ఆసుపత్రుల్లో చేరగా, వారిలో 37,744 మంది కోలుకున్నారు.

వైద్య నిపుణుల హెచ్చరిక.. 'ఫీవర్ కార్నర్స్' ఏర్పాటుకు పిలుపు..


వ్యాధి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ లంగ్ ఫౌండేషన్, చెస్ట్ అండ్ హార్ట్ అసోసియేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ ప్రతినిధులు ఢాకాలో సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించారు. దేశంలో తట్టు నివారణ వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత ముమ్మరం చేయాలని ప్రభుత్వానికి సూచించారు. స్థానిక ఆరోగ్య కేంద్రాలలో ప్రత్యేకంగా జ్వరం పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా తట్టు, నిమోనియా వంటి వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి ప్రాణనష్టాన్ని అడ్డుకోవచ్చని నిపుణులు స్పష్టం చేశారు.

 
ఈ భారీ ప్రాణనష్టానికి పాత ప్రభుత్వ విధానాలే కారణమంటూ బంగ్లాదేశ్‌లో రాజకీయ అగ్గి రాజుకుంది. వ్యాక్సినేషన్ కొనుగోలు వ్యవస్థను సమర్థంగా నిర్వహించడంలో విఫలమయ్యారంటూ మాజీ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు ముహమ్మద్ యూనుస్, ఆరోగ్య సలహాదారు నూర్జహాన్ బేగంలపై విచారణ జరపాలని, బాధితుల కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ ఢాకాలోని ధన్‌మండి ప్రాంతంలో 'సచేతన్ నాగరిక్ సమాజ్' ఆధ్వర్యంలో భారీ మానవహారం నిర్వహించారు.

నిజానికి, గతంలో సజావుగా సాగుతున్న వ్యాక్సిన్ సేకరణ వ్యవస్థను అనాలోచిత నిర్ణయాలతో నిర్వీర్యం చేయడం వల్లే ఈ ముప్పు వాటిల్లిందని, ఇది ముందే నివారించదగిన విపత్తేనని పలు నివేదికలు నిపుణుల మాటగా పేర్కొంటున్నాయి.'తట్టు' లేదా మీజిల్స్ అనేది గాలి ద్వారా వేగంగా వ్యాపించే అంటువ్యాధి. చిన్నారులకు సకాలంలో ఎమ్ఎమ్ఆర్ (MMR) వంటి నివారణ టీకాలు వేయించడం ద్వారా ఈ ప్రాణాంతక మహమ్మారి నుంచి వారిని వంద శాతం సురక్షితంగా కాపాడుకోవచ్చు.

ఇది కూడా చదవండి.. చర్మ సమస్యలు రాకుండా ఎలాంటి కేర్ అవసరం..?

 

ఇది కూడా చదవండి.. మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ కు ఇవి చాలా అవసరం.. 


ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..

ఇది కూడా చదవండి.. మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.