సంప్రదాయ చికిత్సలపై శాస్త్రీయ పరిశోధన కోసం ఐసీఎమ్ఆర్ తో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒప్పందం.. 

షేర్ చేయండి:
సంప్రదాయ చికిత్సలపై శాస్త్రీయ పరిశోధన కోసం ఐసీఎమ్ఆర్ తో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒప్పందం.. 

సాక్షి లైఫ్ : ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ఆయుష్ వైద్య వ్యవస్థకు శాస్త్రీయ ఆధారాలను అందించడం లో ఒక ముఖ్యమైన అడుగు అని కేంద్ర ఆయుష్ మంత్రి సర్బానంద సోనేవాల్ అన్నారు. సాంప్రదాయ వైద్య శాస్త్రాన్ని ప్రోత్సహిస్తామని ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా చెప్పారు.

 ఆయుర్వేదం, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధ ,హోమియోపతి వంటి సాంప్రదాయ వైద్య విధానాలకు శాస్త్రీయ ఆధారాలను అందించడానికి  ఐసీఎమ్ఆర్ పరిశోధనలో సహాయం చేస్తుంది. ఇందుకోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఐసీఎంఆర్ మధ్య ఒప్పందం కుదిరింది.  

ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ సెంటర్‌.. 

ఎయిమ్స్ తో సహా దేశంలోని 22 వివిధ ప్రముఖ ఆసుపత్రులలో ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ కింద, అల్లోపతి,సాంప్రదాయ వైద్య పద్ధతుల ద్వారా చికిత్స సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఐతే ఈ ఒప్పందం ప్రకారం..మొదటగా ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ సెంటర్‌ను డిపార్ట్‌మెంట్‌గా మారుస్తారు. వివిధ వ్యాధులలో దాని చికిత్స ప్రయోజనాలను శాస్త్రీయ పరంగా పరీక్షిస్తారు. దీని కోసం పరిశోధన కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తారు.

సాంప్రదాయ ఔషధాలను.. 
 
ఇది వివిధ వ్యాధుల చికిత్సలో అల్లోపతి చికిత్సతో ఆయుర్వేదం, ఇతర సాంప్రదాయ ఔషధాలను ఏకీకృతం చేయడంలో సహాయపడుతుంది తద్వారా రోగులు మెరుగైన చికిత్సను పొందగలుగుతారు. దీనిపై పరిశోధనకు అయ్యే ఖర్చును ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఐసిఎంఆర్ భరిస్తాయి.

 శాస్త్రీయ ఆధారాలను సేకరించడంలో.. 

సాంప్రదాయ చికిత్సల శాస్త్రీయ ఆధారాలను సేకరించడంలో ఐసిఎంఆర్ సహకారం ఉపయోగపడుతుందని, కొన్ని వ్యాధుల చికిత్స కోసం ఉమ్మడిగా ఉన్నత స్థాయి క్లినికల్ ట్రయల్స్ కూడా నిర్వహించనున్నట్లు ఆయుష్ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. త్వరలోనే  క్లినికల్ ట్రయల్స్ ద్వారా సాంప్రదాయ వైద్య విధానాలకు ఆమోదం లభిస్తుందని ఆయన వెల్లడించారు.

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.