ఏపీలోని ఓ గ్రామంలో అరుదైన వ్యాధితో 20 మంది మృతి, ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధించిన ప్రభుత్వం.. 

షేర్ చేయండి:
ఏపీలోని ఓ గ్రామంలో అరుదైన వ్యాధితో 20 మంది మృతి, ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధించిన ప్రభుత్వం.. 

సాక్షి లైఫ్ : ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామంలో అంతుచిక్కని వ్యాధి కలకలం రేపుతోంది. గత రెండు నెలల్లోనే దీని కారణంగా 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. దీంతో ఏపీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఆ గ్రామంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ ఘటనపై ఆరా తీయడానికి ప్రభుత్వం ఉన్నత స్థాయి వైద్య బృందాలను పంపింది.

ఇది కూడా చదవండి.ఇంటి భోజనం తిన్నా అనారోగ్య సమస్యలకు కారణాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..? 

ఇది కూడా చదవండి..ఈ 5 సప్లిమెంట్స్ కు డబ్బు దండగ అంటున్న వైద్యనిపుణులు..!

 

మెలియాయిడోసిస్ అనుమానం: తొలి నివేదికల్లో నిర్ధారణ.. 

ఈ అంతుచిక్కని వ్యాధికి గల కారణాలపై ప్రభుత్వం లోతైన దర్యాప్తునకు ఆదేశించింది. వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ రఘునందన్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక బృందం తురకపాలెం గ్రామాన్ని సందర్శించి పరిస్థితులను సమీక్షించింది. తురకపాలెంగ్రామంలోని 2,500 మంది నివాసితులకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు. వైద్య అధికారుల బృందం గ్రామాన్ని సందర్శించింది. ప్రాథమిక ప్రయోగశాల నివేదికల ఆధారంగా, గ్రామస్తులలో ఇద్దరికి మెలియాయిడోసిస్ అనే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ సోకినట్లు నిర్ధారణ కావడంతో అధికారులు ఇదే ప్రధాన కారణమని అనుమానిస్తున్నారు.   

ఇది కూడా చదవండి..లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?   

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.