ఇంటి భోజనం తిన్నా అనారోగ్య సమస్యలకు కారణాలు ఏమిటి..?
సాక్షి లైఫ్ : ఇంటి భోజనం తింటున్నా కూడా ఎందుకు అనారోగ్యం పాలవుతున్నాం? ఈ ప్రశ్న చాలామందికి వర్తిస్తుంది. దీనికి కారణం మన ఆధునిక జీవనశైలి, ఆహార నాణ్యతలో వచ్చిన మార్పులేనని న్యూట్రిషనిస్ట్ లు చెబుతున్నారు. మన శరీరానికి అవసరమైన పోషకాలు కేవలం ఆహారం ద్వారా లభించడం లేదు. అందుకే విటమిన్ డి, బి12, ఒమేగా-3 వంటి కొన్ని సప్లిమెంట్లు తీసుకోవడం తప్పనిసరి అవుతోంది.
ఇది కూడా చదవండి..ఈ 5 సప్లిమెంట్స్ కు డబ్బు దండగ అంటున్న వైద్యనిపుణులు..!
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
మన నానమ్మ, అమ్మమ్మల కాలంలో సప్లిమెంట్స్ అవసరం లేకపోయినా, నేటి జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న ఒత్తిడి కారణంగా ఇంటి ఆహారం మాత్రమే సరిపోవడం లేదని న్యూట్రిషనిస్ట్ లు అంటున్నారు. అందువల్ల, సరైన ఆహారంతో పాటు, అవసరమైన పోషకాలను సప్లిమెంట్ల ద్వారా తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని వారు చెబుతున్నారు.
విటమిన్ డి..
నేటి కాలంలో చాలామంది ఇళ్ళు, ఆఫీసులకే పరిమితం అవుతున్నారు. దీనివల్ల సూర్యరశ్మి తక్కువగా తగలడం వల్ల విటమిన్ డి లోపం సర్వసాధారణంగా మారింది. ఈ లోపం వల్ల ఎముకలు బలహీనపడటం, తరచుగా అనారోగ్యానికి గురవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. విటమిన్ డి ఎముకలను దృఢంగా ఉంచుతుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలసటను తగ్గిస్తుంది. విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకోవడంతో పాటు, ప్రతిరోజూ 10 నిమిషాలు ఎండలో కూర్చోవడం చాలా ముఖ్యం.
విటమిన్ బి12..
భారతదేశంలో చాలామంది శాకాహారులే. శాకాహారం ద్వారా విటమిన్ బి12 చాలా తక్కువగా లభిస్తుంది. ఈ విటమిన్ లోపం వల్ల అలసట, బలహీనత, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. విటమిన్ బి12 శరీరాన్ని శక్తివంతం చేస్తుంది, రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది, మెదడు, నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఈ లోపం ఉన్నవారు బి12 సప్లిమెంట్లు లేదా ఫోర్టిఫైడ్ ఫుడ్ తీసుకోవడం మంచిది. ముఖ్యంగా వృద్ధులు లేదా జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారికి వైద్యులు ఇంజెక్షన్లు లేదా టాబ్లెట్లు సూచిస్తారు.
ఒమేగా-3..
మన రోజువారీ ఆహారంలో చేపలు, అవిసె గింజలు, వాల్‌నట్‌లు వంటివి తక్కువగా ఉంటాయి. దీనివల్ల శరీరంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లోపం ఏర్పడుతుంది. ఒమేగా-3 గుండె ఆరోగ్యానికి చాలా మంచిది, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా, చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా ఇది ఎంతగానో సహాయపడుతుంది. శాకాహారులు అవిసె గింజలు లేదా వాల్‌నట్స్ తో తయారు చేసిన సప్లిమెంట్లను తీసుకోవడం ఉత్తమం.
ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
