New Pandemic Threat : కొత్త మహమ్మారి ముప్పు..? 'ఇన్ఫ్లుయెంజా డి'పై శాస్త్రవేత్తల హెచ్చరిక..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్రపంచాన్ని వణికించిన కరోనా రక్కసి ఛాయలు ఇంకా పూర్తిగా తొలగిపోకముందే, మరో కొత్త వైరస్ ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు పశువులకు మాత్రమే పరిమితమైన 'ఇన్ఫ్లుయెంజా డి' (IDV) వైరస్, ఇప్పుడు మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు.. 

ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..

ఇది కూడా చదవండి.. మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?

 

ఏమిటీ 'ఇన్ఫ్లుయెంజా డి'..?

సాధారణంగా మనం వినే ఇన్ఫ్లుయెంజా ఏ, బి వైరస్‌లు మనుషుల్లో కాలానుగుణంగా వచ్చే జలుబు, జ్వరాలకు కారణమవుతాయి. అయితే, 2011లో తొలిసారిగా గుర్తించిన 'ఇన్ఫ్లుయెంజా డి' ప్రధానంగా ఆవులు, పందులు వంటి పశువులలో కనిపించింది. గత దశాబ్ద కాలంగా ఇది పలు దేశాల్లో జంతువుల నుంచి జంతువులకు వేగంగా వ్యాప్తి చెందుతోంది.

మనుషులకు ముప్పు ఎలా..?

ఇటీవలి పరిశోధనల ప్రకారం..ఈ వైరస్ మనుషుల శ్వాసకోశ కణాలలో కూడా వృద్ధి చెందే సామర్థ్యాన్ని కలిగి ఉందని తేలింది. ముఖ్యంగా పశువులతో నేరుగా సంబంధం కలిగి ఉండే రైతులలో ఈ వైరస్ పట్ల రోగనిరోధక శక్తి ఉన్నట్లు గుర్తించారు. అంటే, ఈ వైరస్ ఇప్పటికే మనుషుల్లోకి ప్రవేశించడం మొదలైందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

భారత్‌కు ఎందుకు ప్రమాదం..?

భారతదేశం వంటి వ్యవసాయ ఆధారిత దేశాల్లో పశుపోషణ అధికం. మనుషులు, జంతువుల మధ్య నిరంతరం సామీప్యత ఉండటం వల్ల 'జూనోటిక్ స్పిల్‌ఓవర్' (జంతువుల నుంచి మనుషులకు వైరస్ వ్యాప్తి) జరిగే అవకాశం ఎక్కువగా ఉంది.

సవాళ్లు ఇవే..

 సాధారణ ఫ్లూ పరీక్షల్లో ఈ వైరస్‌ను గుర్తించడం సాధ్యం కాదు. దీనివల్ల ఇది మనుషుల్లో వ్యాపించినా సామాన్య జలుబుగా భావించే ప్రమాదం ఉంది. జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వైరస్‌ల పట్ల క్షేత్రస్థాయిలో సరైన పర్యవేక్షణ వ్యవస్థలు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. వ్యాప్తి వేగం.. శ్వాసకోశ వైరస్ కావడంతో, ఒకవేళ ఇది మనుషుల మధ్య వ్యాపించడం మొదలైతే అదుపు చేయడం కష్టతరమవుతుంది.

నిపుణుల సూచనలు.. 

ముందస్తు జాగ్రత్తలే ఈ ముప్పు నుంచి మనల్ని రక్షిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. పశువైద్యం, మానవ వైద్య విభాగాల మధ్య సమన్వయం పెరగాలి. అధునాతన పరీక్షలు.. ఇన్ఫ్లుయెంజా డి నిర్ధారణకు ప్రత్యేక కిట్లను అందుబాటులోకి తెవాలి. జన్యు విశ్లేషణ.. వైరస్‌లో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనించాలి. వచ్చే ముప్పును ముందే పసిగట్టి అప్రమత్తంగా ఉండటమే రేపటి ఆరోగ్యకర ప్రపంచానికి మార్గమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..Ban Paraquat : ప్రాణాంతక గడ్డి మందు "పారాక్వాట్" ను నిషేధించాల్సిందే..! : వైద్య నిపుణులు

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.