NIMS Rare Record : ‘నిమ్స్’ అరుదైన రికార్డు.. 2 వేల కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు పూర్తి చేసిన ఆసుపత్రి..!

షేర్ చేయండి:
NIMS Rare Record : ‘నిమ్స్’ అరుదైన రికార్డు.. 2 వేల కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు పూర్తి చేసిన ఆసుపత్రి..!

సాక్షి లైఫ్ : ప్రభుత్వ రంగ వైద్య సేవల్లో హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ సరికొత్త రికార్డు సృష్టించింది. నిమ్స్ ఆసుపత్రిలో ఇప్పటివరకు విజయవంతంగా రెండు వేల కిడ్నీ మార్పిడి (Renal Transplant) శస్త్రచికిత్సలను పూర్తి చేశారు. తద్వారా దేశంలోనే ప్రభుత్వ రంగంలో అత్యధిక సంఖ్యలో కిడ్నీ మార్పిడి సర్జరీలు చేసిన అగ్రశ్రేణి వైద్య కేంద్రాల్లో ఒకటిగా నిమ్స్ నిలిచింది.

తెలంగాణ ఆరోగ్య రంగానికి గర్వకారణమైన ఈ అద్భుత మైలురాయిని సాధించిన నిమ్స్ వైద్య బృందాన్ని, పారామెడికల్ సిబ్బందిని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

1989లో అంకురార్పణ..

నిమ్స్ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి సేవల ప్రస్థానం 1989లో ప్రారంభమైంది. అప్పట్లో యూరాలజీ విభాగం ఆధ్వర్యంలో మొట్టమొదటి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. అప్పటి నుంచి క్రమంగా విస్తరిస్తూ, అత్యాధునిక సాంకేతికతను జోడించుకుంటూ ఈ విభాగం రోగులకు కొండంత అండగా నిలుస్తోంది.

మూడు దశాబ్దాల ప్రస్థానంలో..

1989-2010.. తొలి రెండు దశాబ్దాల కాలంలో నిమ్స్‌లో 448 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి. 2011-జూన్ 2017..తర్వాతి ఆరేళ్ల కాలంలోనే వైద్య సేవల వేగం పుంజుకుని మరో 552 సర్జరీలను విజయవంతంగా పూర్తి చేశారు.గత కొన్నేళ్లుగా ప్రభుత్వ మద్దతు, మౌలిక వసతుల కల్పనతో శస్త్రచికిత్సల వేగం మరింత పెరిగింది.

ఉచిత వైద్య పథకాల కింద పేద రోగులకు సైతం అత్యంత ఖరీదైన ఈ వైద్య సేవలను అందిస్తూ, తాజాగా 2,000వ మార్పిడి మైలురాయిని విజయవంతంగా అధిగమించారు. ప్రభుత్వ రంగంలో ఇంతటి భారీ సంఖ్యలో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించడం నిమ్స్ వైద్యుల ప్రతిభకు, అంకితభావానికి నిదర్శనమని ఆరోగ్య రంగ నిపుణులు కొనియాడుతున్నారు.

 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?  

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.