Metabolic Syndrome : పెరుగుతున్న 'మెటబాలిక్ సిండ్రోమ్'.. దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరికి..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మన గుండె నిరంతరం కొట్టుకోవాలన్నా, తీసుకున్న ఆహారం శక్తిగా మారాలన్నా, ప్రతి సెకనుకు కోట్లాది కణాలు చురుగ్గా పనిచేయాలన్నా మన శరీరంలోని జీవక్రియ (metabolism) సక్రమంగా సాగాలి. ఈ వ్యవస్థలో సమతుల్యత దెబ్బతిన్నప్పుడు తలెత్తే ప్రమాదకర పరిస్థితినే వైద్య పరిభాషలో 'మెటబాలిక్ సిండ్రోమ్' (Metabolic Syndrome)అంటారు. 'నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్'లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. భారతదేశంలోని పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రతి ముగ్గురు వయోజనుల్లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు.

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..Detox Water : కాపర్ బాటిల్‌లో 'డిటాక్స్ వాటర్' ఎందుకు ప్రమాదకరం..?

ఇది కూడా చదవండి..Dangerous Diabetes : మధుమేహం విషయంలో టైప్ 1 లేదా టైప్ 2, ఏది ఎక్కువ ప్రమాదకరం..?

 

50 ఏళ్లు దాటిన వారిలో ఈ ముప్పు 40 శాతానికి పైగా ఉంది. అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ప్రారంభ దశలో దీనికి ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించవు. అందుకే వైద్యులు దీనిని ఒక 'సైలెంట్ హెల్త్ థ్రెట్' (నిశ్శబ్ద ఆరోగ్య ముప్పు)గా అభివర్ణిస్తున్నారు. ఈ వ్యాధి గురించిన పూర్తి వివరాలను ఢిల్లీలోని ధర్మశిల నారాయణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఎండోక్రైనాలజీ కన్సల్టెంట్ డాక్టర్ అభినాబా హజ్రా వివరించారు.

అసలేమిటీ మెటబాలిక్ సిండ్రోమ్..?

అనేక జీవక్రియ లోపాల కలయిక. ఈ స్థితిలో శరీరం చక్కెర, కొవ్వు , శక్తిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతుంది. భవిష్యత్తులో రాబోయే తీవ్రమైన అనారోగ్యాలకు ఇది ఒక ముందస్తు హెచ్చరిక వంటిది. నడుము చుట్టూ అధిక కొవ్వు (accumulation of fat around the abdomen), అధిక రక్తపోటు (hypertension), రక్తంలో అధిక చక్కెర స్థాయిలు (High blood sugar levels), రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ (triglycerides) పెరగడం, మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలు తగ్గిపోవడం. ఈ ప్రధాన ప్రమాద కారకాల్లో కనీసం 3 లేదా అంతకంటే ఎక్కువ ఒకే వ్యక్తిలో కనిపిస్తే, వారికి మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారిస్తారు.

ఇది కూడా చదవండి..Knee Cartilage Damage : మోకాళ్లలో ‘జిగురు’ తగ్గుతోందా..? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం వద్దు..!

ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.