చలిగాలులతో ట్రాఫిక్ పై తీవ్ర ప్రభావం..
సాక్షి లైఫ్ : ఢిల్లీలో రెండు రోజుల పాటు దట్టమైన నుంచి అతి దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ కారణంగా వాతావరణ శాఖ రెండు రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. శనివారం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గురు, శుక్రవారాల్లో ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు, కొన్ని ప్రాంతాల్లో తీవ్రంగా పొగమంచు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
దట్టమైన పొగమంచు ఉన్నట్లయితే, మినిమమ్ విజిబులిటీ 50 నుంచి 200 మీటర్ల మధ్య ఉంటుంది. చాలా దట్టమైన పొగమంచు ఉన్నట్లయితే, మినిమమ్ విజిబులిటీ సున్నా నుంచి 50 మీటర్ల మధ్య ఉంటుంది.
ఇది కూడా చదవండి..కిడ్నీలో రాళ్లు ఎలా ఏర్పడతాయి..? వాటికి కారణమేమిటి..?
ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?
ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు..
ట్రాఫిక్ పై ప్రభావం..
దట్టమైన పొగమంచు రోడ్డు, రైలు రవాణా సేవలను ప్రభావితం చేయవచ్చు. రోడ్డు ప్రమాదాలు కూడా జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీలో గాలి నాణ్యత గురువారం డేంజర్ కేటగిరీలో నమోదైంది. రాబోయే రెండు రోజుల్లో కూడా అక్కడి కాలుష్య స్థాయిలు మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి 7 మార్గాలు
ఇది కూడా చదవండి..అల్లోపతి, యునాని చికిత్సా విధానాల మధ్య ముఖ్యమైన తేడాలు ఏమిటి?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
