నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు.. 

షేర్ చేయండి:
నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు.. 

సాక్షి లైఫ్ : ఇటీవల మార్కెట్‌లో ముడి బియ్యం తోపాటు అనేక రకాలు అందుబాటులో ఉన్నాయి. అటువంటివాటిలో నల్ల బియ్యం కూడా ఒకటి. ఈ బియ్యంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అధిక ఫైబర్ కలిగి ఉన్న ఈ బియ్యం మధుమేహంతో సహా అనేక వ్యాధులను నయం చేస్తుందట. నల్ల బియ్యం ఎక్కువగా చైనా, భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలతో సహా దక్షిణాసియా దేశాలలో పండిస్తున్నారు. అంతేకాదు వీటిని కేరళలోని కొన్ని ప్రాంతాల్లో కూడా సాగు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి.

ఇది కూడా చదవండి..ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉండాలి..?

ఇది కూడా చదవండి..హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విషయంలో అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

ఫైబర్ కాకుండా, బ్లాక్ రైస్‌లో ఇతర బియ్యం కంటే ఎక్కువ ప్రోటీన్ కూడా ఉంటుంది. 23 రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. బ్లాక్ రైస్ గుండె ఆరోగ్యానికి కూడా మంచిదని చెబుతున్నారు. ద్రాక్ష, మామిడిపండ్లకు ముదురు వైలెట్ రంగును ఇచ్చే ఆంథోసైనిన్, ఈ బియ్యం విషయంలో నలుపు రంగును ఇస్తుంది.

బ్లాక్ రైస్ ఆరోగ్య ప్రయోజనాలు..

నల్ల బియ్యం మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరం. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, ఐరన్ కూడా ఉంటాయి. ఈ పోషకాలతో పాటు, బ్లాక్ రైస్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉన్నాయి.

ఇది ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. పావు కప్పు అన్నంలో ప్రోటీన్, కొవ్వు, కార్బోహైడ్రేట్లు, సహజ ఫైబర్, ఇనుములభిస్తాయి. బ్లాక్ రైస్‌లో ఉండే అధిక ఫైబర్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ఈ నల్ల బియ్యంలో గ్లూటెన్ ఉండదు. బరువు తగ్గదాంతోపాటు మధుమేహంతో సహా అనేక వ్యాధులు నయమవుతాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో బ్లాక్ రైస్ ఎంతగానో ఉపయోగపడుతాయి. ఈ బియ్యం చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతాయి.

ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?

ఇది కూడా చదవండి..ఉదయాన్నే మధుమేహం ఉన్నవారు బ్రేక్ ఫాస్ట్ లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.