మంకీపాక్స్‌ కేసుల నివారణకు హైదరాబాద్ లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు

షేర్ చేయండి:
మంకీపాక్స్‌ కేసుల నివారణకు హైదరాబాద్ లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు

సాక్షి లైఫ్ : మంకీపాక్స్‌ కేసుల నివారణకు సంబంధించి తెలంగాణ సర్కారు అలర్ట్ అయ్యింది. ఇతర దేశాల్లో ఇటీవల ఈ కేసులు పెరగడంతో ఆరోగ్య శాఖా అధికారులు అప్రమత్తమయ్యారు. అందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. గాంధీ ఆసుపత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఫీవర్ హాస్పిటల్ లో మంకీపాక్స్‌ చికిత్స కోసం ప్రత్యేక ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేయగా, గాంధీ ఆసుపత్రిలో కూడా  ప్రత్యేక వార్డును గుర్తించి అవసరమైన చర్యలు చేపడుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ఆదేశాల మేరకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచారు.

ఇది కూడా చదవండి..పచ్చబొట్టు తొలగింపు ప్రక్రియ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?

ఇది కూడా చదవండి..ఎం పాక్స్ : ఢిల్లీలోని ఆరు ఆసుపత్రులలో అందుబాటులో మంకీపాక్స్ చికిత్స..

ఇది కూడా చదవండి..చాందీపురా వైరస్‌ లక్షణాలను ఎలా గుర్తించాలి..?  

ప్రభుత్వ ఫీవర్ హాస్పిటల్ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జయలక్ష్మి మాట్లాడుతూ, "మంకీపాక్స్ అనుమానిత కేసులు ఇంకా నమోదు కాలేదు. అయినా, ఎం పాక్స్ కేసులను నిర్మూలించడానికి ముందుగానే ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేశామని చెప్పారు. ఇటీవల ఎక్కువగా జ్వరంతో వచ్చేవారి సంఖ్య  పెరిగిందని ఆమె వెల్లడించారు.  

 గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజ్ కుమారి మాట్లాడుతూ, "మేము గాంధీ ఆసుపత్రిలో కూడా అవసరమైన అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచామని, మంకీపాక్స్‌ కోసం ప్రత్యేక ఐసోలేషన్ వార్డును సిద్ధం చేశాము," అని తెలిపారు. ఈ చర్యలు మంకీపాక్స్‌ వ్యాప్తిని నిరోధించడంలో, కేసులను సమర్థవంతంగా నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వ దృఢ సంకల్పాన్ని ప్రతిబింబిస్తాయని, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.