సాక్షి లైఫ్ : ఎం పాక్స్ వ్యాప్తి మంకీపాక్స్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్ అప్రమత్తమైంది. అందులో భాగంగానే ఢిల్లీలో మంకీపాక్స్ చికిత్స విషయంలో అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేస్తోంది. మంకీపాక్స్ రోగులకు ప్రత్యేకంగా చికిత్స అందించడానికి ఢిల్లీలోని ఆరు ప్రభుత్వ ఆసుపత్రులను ఎంపిక చేశారు. వీటిలో ఎయిమ్స్ సఫ్దర్‌జంగ్ ఆర్ ఎంఎల్ హాస్పిటల్, లోక్‌నాయక్ జీటీబీ, అంబేద్కర్ హాస్పిటల్ ఉన్నాయి. AIIMSలో ఐదు పడకలు, సఫ్దర్‌జంగ్ రిఫరల్ హాస్పిటల్ ఏర్పాట్లు చేశారు. లోక్‌నాయక్ ఆసుపత్రి నోడల్ ఆసుపత్రిగా పని చేస్తుంది.
ఇది కూడా చదవండి..కిడ్నీ దానం ఎలాంటి వాళ్లు చేయవచ్చు..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్య శాఖ మూడు ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటుచేయడం ద్వారా మొత్తం 40 పడకలను సిద్ధం చేయాలని ఆదేశించింది. మరోవైపు, AIIMS అత్యవసర పరిస్థితుల్లో రోగుల స్క్రీనింగ్ ,చికిత్స కోసం ఆపరేటింగ్ స్టాండర్డ్ ప్రొసీజర్ (SOP)ని జారీ చేసింది. అలాగే ఆస్పత్రిలోని ఏబీ-7 వార్డులో ఐదు పడకలను కేటాయించారు. వీటిల్లో మంకీపాక్స్ లక్షణాలు ఉన్న రోగులను మాత్రమే చేర్చుకుంటారు.
AIIMS జారీ చేసిన SOPలో, సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిని రిఫరల్ ఆసుపత్రిగా మార్చారు. పరీక్షలో మంకీపాక్స్ నిర్ధారణ అయితే, రోగిని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలిస్తారు.
జీబీటి అంబేద్కర్ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డు..
లోక్‌నాయక్ ఆసుపత్రిలో 20 పడకలు ఉంటాయి. ఇది నోడల్ ఆసుపత్రిగా పని చేస్తుంది. ఇది కాకుండా, జిటిబి అండ్ అంబేద్కర్ ఆసుపత్రిలో 10 ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీచేశారు అధికారులు. ఈ వ్యాధిలో మరణాల రేటు చాలా తక్కువగా ఉందని, అయినా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ కమ్యూనిటీ మెడిసిన్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ జుగల్ కిషోర్ తెలిపారు.
2022లో ఢిల్లీలో మంకీపాక్స్ కేసు..
పాకిస్తాన్‌లో పలు ఎం పాక్స్ కేసులు నమోదయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆగస్టు 14న మంకీపాక్స్‌ను గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఈ ఏడాది ఇప్పటివరకు 26 దేశాల్లో 934 కేసులు నమోదయ్యాయి. ఈ కారణంగా, ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతోంది.
1970లో మొదటిసారిగా ఆఫ్రికా దేశమైన కాంగోలో మనుషుల్లో ఈ వ్యాధి కనిపించింది. 2022లో 116 దేశాల్లో 99,176 మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయి. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా 208 మరణాలు సంభవించాయి. 2022 సంవత్సరంలో భారతదేశంలో 23 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి.
మంకీపాక్స్ లక్షణాలు..
మంకీపాక్స్ అనేది మశూచి వంటి వ్యాధి. జ్వరం, తలనొప్పి, దద్దుర్లు, కండరాల నొప్పులు, చర్మంపై దద్దుర్లు, పొక్కులు, దురద, చర్మంపై గాయాలు,శరీరంలో చాలా చోట్ల బొబ్బలు వస్తాయి. మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి. కోతులు, ఇతర జంతువుల దూరంగా ఉండండి. ఇళ్లలో పరిశుభ్రత పాటించండి. దీనికి సంబంధించిన లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యులను సంప్రదించండి.
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com