చాందీపురా వైరస్‌ లక్షణాలను ఎలా గుర్తించాలి..?  

షేర్ చేయండి:
చాందీపురా వైరస్‌ లక్షణాలను ఎలా గుర్తించాలి..?  

సాక్షి లైఫ్ : గుజరాత్ లో చాందీపురా వైరస్‌ విజృంభిస్తుంది. అటు రాజస్థాన్ లోనూ ఈ వైరస్ ప్రభావం మొదలైంది. దీంతో దేశంలోని పలురాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. వ్యాధి వ్యాప్తి చెందకుండా మరిన్ని చర్యలు తీసుకుంటున్నారు ఆరోగ్య శాఖా అధికారులు.  చాందీపురా వైరస్‌ లక్షణాలను ఎలా గుర్తించాలి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..  

చాందీపురా వైరస్‌లో అనేక రకాల లక్షణాలు కనిపిస్తున్నాయి. రోగికి ఎలాంటి సమస్య ఉండకపోవచ్చు. తీవ్ర జ్వరం వస్తుంది. ఇది 103-104 డిగ్రీలు వరకూ వస్తుంది. జ్వరం తర్వాత వాంతులు అవుతాయి. కొంత సమయం తర్వాత పిల్లవాడు అపస్మారక స్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. దీనిని  అక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్ (ఏఈఎస్) అంటారు. ఇది ఏఈఎస్ వైరస్‌లు , నాన్-వైరస్‌ల వల్ల కూడా సంభవించవచ్చు. 60 శాతం కేసులలో ఈ ఏఈఎస్ వైరస్‌ను గుర్తించలేమని వైద్యనిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..ఆఫ్రికాలో వేగంగా విస్తరిస్తున్న మంకీపాక్స్.. 

జపనీస్ ఎన్సెఫాలిటిస్ (జేఈ)తో సహా అక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్ (ఏ ఈ ఎస్) అనేది అనేక రకాల వైరస్‌లు, బ్యాక్టీరియా, ఫంగస్, పరాన్నజీవులు, స్పిరోచెట్‌లు, రసాయన, విషపదార్థాలు మొదలైన వాటి వల్ల కలిగే ఒక విధమైన న్యూరోలాజికల్ సమస్య. ఇలాంటి వైరస్లు కాలానుగుణంగా మార్పు చెందుతుంటాయి.  

 మెదడు.. 

 చాందీపూర వైరస్ నేరుగా మెదడులోకి వెళుతుంది. అప్పుడు మెదడులో ఇన్ఫెక్షన్ అవుతుంది. దీనికారణంగా మెదడు వాపు వస్తుంది. వాపు సంభవించిన తర్వాత, రోగిలో మూర్ఛ , తిమ్మిరి వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. 

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.