ఫుడ్ కల్తీ చేసే వారిపై కఠిన చర్యలు..
సాక్షి లైఫ్ : తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హోటల్స్ అసోసియేషన్ల తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ.. ఆహార కల్తీ చేసే వారిపై, నాణ్యత పాటించని వారిపై కఠినంగా వ్యవహరిస్తామని, అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
ఇది కూడా చదవండి.. రక్తదానం చేయడం వల్ల నిజంగా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చా..?
నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలని వివిధ అసోసియేషన్ ప్రతినిధులకు తెలియజేశారు. నిజాం కాలం నుంచి హైదరాబాద్ బిర్యాని కి అంతర్జాతీయంగా గుర్తింపు ఉందని ఆయన అన్నారు. హైదరాబాద్ ను మెడికల్ టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతున్నామని, ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచుతామని ఆయన చెప్పారు.
హోటల్ ల యజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని, ప్రతి ఆరు నెలలకు ఒకసారి వర్క్ షాప్ ల నిర్వహణతో పాటు అవగాహన సదస్సులను నిర్వహిస్తామని మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. హోటల్స్ యజమానులు చేసిన పలు విజ్ఞప్తులపై ఆయన సానుకూలంగా స్పందించారు.
ఇది కూడా చదవండి.. మెడిటేషన్ ద్వారా మెంటల్ హెల్త్ బెనిఫిట్స్..
హైదరాబాద్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కమిషనర్ ఫుడ్ సేఫ్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్, నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్, ఆయిల్ మర్చంట్ అసోసియేషన్, బార్ అండ్ రెస్టారెంట్స్, ఇండియన్ డైలీ మిల్క్ ప్రొడక్ట్స్ అసోసియేషన్, తెలంగాణ ప్యాకేజెడ్ డ్రింకింగ్ వాటర్ అసోసియేషన్, తెలంగాణ రోలర్ ఫ్లోర్ మిలర్స్,బేకరీ అండ్ ఐస్ క్రీమ్స్ అసోసియేషన్ లు పాల్గొన్నారు.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా క్యాన్సర్ రావడానికి కారణాలేంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
