బర్డ్ ఫ్లూ అలెర్ట్ : అప్రమత్తమైన తెలంగాణ సర్కార్..
సాక్షి లైఫ్ : కోళ్లు చనిపోవడానికి కారణమవుతున్న హైలీ పాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లూయెంజా (హెచ్పీఏఐ) వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించిందితెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసాచి ఘోష్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్ఫ్లూయెంజాపై పౌల్ట్రీ రైతులు, వ్యాపారులు, ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం సూచించింది.
ఇది కూడా చదవండి..డైట్ మధుమేహ నిర్వహణకు ఎలా సహాయపడుతుంది..?
ఇది కూడా చదవండి..డయాబిటిస్ రిస్క్ ఎలాంటివాళ్లకు ఎక్కువ..?
ఇది కూడా చదవండి..హెపటైటిస్ బి, సి ప్రాణాంతకమా..?
బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను సకాలంలో గుర్తించాలని, ఇతర కోళ్ల కు ఆ వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది సర్కారు. అలాగే చనిపోయిన వాటిని నిర్లక్ష్యంగా పడేయకుండా వాటిని ఎలా పూడ్చా లో అవగాహన కల్పించాలని వివరించింది. కోళ్ల మరణాలకు సంబంధించి పశువైద్య, పశుసంవర్ధక శాఖ సిబ్బందికి ఎప్పటికప్పుడు సమాచారం అందేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఇతర రాష్ట్రాల తెలంగాణలో ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై అటవీ, పోలీసు, ఆరోగ్య, పశువైద్య, పశుసంవర్ధక శాఖలతో జిల్లాస్థాయి సమావేశాలను ఏర్పా టు చేసుకోవాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేసింది. సరిహద్దు ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల వద్ద ప్రత్యేకంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ సరిహద్దుల్లో 24 చెకోపోస్టులను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని రెండు ప్రాంతాల్లో కోళ్లమర ణాలకు ఏవియన్ ఇన్ఫ్లూయెంజా వైరస్ కారణమని తేలిందని అక్కడి అధికారులు చెప్పారు.
ఇది కూడా చదవండి..ఎక్కువసేపు కూర్చోవడం వల్ల రక్త ప్రసరణపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ కు మెనోపాజ్ కు లింక్ ఏంటి..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
