డయాబిటిస్ రిస్క్ ఎలాంటివాళ్లకు ఎక్కువ..?
సాక్షి లైఫ్ : షుగర్ సమస్య (డయాబిటిస్) అనేది రక్తంలో చక్కెర స్థాయి అధికంగా ఉండడం వల్ల వస్తుంది. ఈ సమస్య తలెత్తడానికి అనేక కారణాలున్నాయి. అటువంటివాటిలో జీవనశైలి ప్రధాన పాత్ర పోషిస్తుంది. 40 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి షుగర్ సమస్య వచ్చే అవకాశం ఎక్కువ. వయస్సుతో పాటు ఇన్సులిన్ ప్రక్రియలో మార్పులు వస్తాయి కాబట్టి.
అధిక బరువు లేదా ఒబెసిటీ..
బరువు ఎక్కువగా ఉన్నవారు, వ్యాయామం లేకుండా ఉన్నవారిలో గ్లూకోజ్ పెరిగే అవకాశం ఉంది. తద్వారా షుగర్ సమస్య వస్తుంది.
ఇది కూడా చదవండి..ఎక్కువసేపు కూర్చోవడం వల్ల రక్త ప్రసరణపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ కు మెనోపాజ్ కు లింక్ ఏంటి..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
ఆహారపు అలవాట్లు..
అధిక చక్కెర, కొవ్వు, ప్రాసెస్డ్ ఆహారం, వేగవంతమైన ఆహారం తీసుకునే వారు, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినే అలవాటు ఉన్న వారు షుగర్ బారీన పడే ప్రమాదం ఉంటుంది.
ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమి..
మానసిక ఒత్తిడి, నిద్రలేమి కూడా షుగర్ రిస్క్‌ను పెంచుతాయి. ఎక్కువ ఒత్తిడి ఉన్నప్పుడు శరీరం ఇన్సులిన్‌ను సమర్థంగా ఉపయోగించు కోలేదు. మానసిక ఆరోగ్య సమస్యలు, అంటే ఆందోళన, ఒత్తిడి అనేవి రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేయవచ్చు.
శారీరక శ్రమ లేకపోవడం..
నిత్యం వ్యాయామం చేయని, శారీరక శ్రమ లేకపోవడం కూడా షుగర్ సమస్య వచ్చే అవకాశాలను పెంచుతుంది.
హై బ్లడ్ ప్రెషర్ లేదా హై కొలెస్టరాల్ ఉన్న వారు..
రక్తపోటు (బ్లడ్ ప్రెషర్) , కోలెస్టరాల్ స్థాయిలు ఎక్కువగా ఉండే వారు, ప్రత్యేకంగా డయాబిటిస్ రిస్క్ లో ఉంటారు.
గర్భధారణ సమయంలో గ్లూకోజ్ స్థాయి పెరిగిన వారికి (Gestational Diabetes): గర్భిణీ స్త్రీలకు గర్భధారణ సమయంలో షుగర్ సమస్య ఏర్పడినట్లైతే, భవిష్యత్తులో వారికి టైప్ 2 డయాబిటిస్ వచ్చే అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి..ప్రీ-డయాబెటిస్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..శీతాకాలంలో గుండె సంబంధిత సమస్యలు ఎందుకు పెరుగుతాయి..?
ఇది కూడా చదవండి.. దీర్ఘకాలం యవ్వనంగా ఉంచే కొల్లాజెన్..
ఇది కూడా చదవండి..జ్ఞాపకశక్తిని పెంచే 5 అద్భుత ఆహారాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
