Health Mission-100 : తెలంగాణరాష్ట్రంలో 100 రోజులపాటు 'హెల్త్ మిషన్-100'.. మార్చి 2 నుంచి జూన్ 9 వరకు..

షేర్ చేయండి:
Health Mission-100 : తెలంగాణరాష్ట్రంలో 100 రోజులపాటు 'హెల్త్ మిషన్-100'.. మార్చి 2 నుంచి జూన్ 9 వరకు..

సాక్షి లైఫ్ : తెలంగాణరాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మరో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'హెల్త్ మిషన్-100' పేరుతో వంద రోజుల ప్రత్యేక వైద్య శిబిరాలు, అవగాహన కార్యక్రమాలను నిర్వహించనుంది. మార్చి 2న ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం జూన్ 9 వరకు కొనసాగనుంది. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, వృద్ధులు, బలహీన వర్గాల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ఈ మిషన్ రూపుదిద్దుకుంది.

 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

 

మూడు దశల్లో ఆరోగ్య సేవలు..

ఈ వంద రోజుల ప్రణాళికను ప్రభుత్వం మూడు ప్రధాన దశలుగా విభజించింది:

మొదటి దశ (మార్చి 2 - 31)..

ఈ దశలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపై దృష్టి సారిస్తారు. రక్తహీనత (Anemia) పరీక్షలు, ఇమ్యునైజేషన్, 'ఆరోగ్య మహిళ' కింద క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 33 ప్రభుత్వ ఆసుపత్రుల్లో వృద్ధుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తారు.

రెండవ దశ (ఏప్రిల్ 1 - 15)..

ఈ దశలో అసంక్రమిత వ్యాధులు (Non-communicable diseases) ,క్యాన్సర్ సంరక్షణపై దృష్టి పెడతారు. కొత్తగా క్యాన్సర్ సంరక్షణ విధానాన్ని ప్రకటించడంతో పాటు, జిల్లా స్థాయి డే-కేర్ సెంటర్లలో కీమోథెరపీ సేవలను మ్యాపింగ్ చేస్తారు.

మూడవ దశ (ఏప్రిల్ 16 - మే 15)..

అంటువ్యాధుల నియంత్రణ, 'టీబీ రహిత తెలంగాణ' డ్రైవ్, జైళ్లలో హెచ్‌ఐవీ (HIV) స్క్రీనింగ్‌కు ప్రాధాన్యత ఇస్తారు. ఎండదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో ప్రత్యేక 'హీట్-స్ట్రోక్ మేనేజ్‌మెంట్' గదులను సిద్ధం చేస్తారు.

 తేదీలు - కార్యక్రమాలు.. 

మార్చి 8: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మహిళల ఆరోగ్య డ్రైవ్.

మార్చి 16: జాతీయ టీకా దినోత్సవం పురస్కరించుకుని ముమ్మర టీకా కార్యక్రమాలు.

ఏప్రిల్ 7: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నాడు ఉత్తమ సేవలు అందించిన వైద్యులకు అవార్డుల ప్రదానం.

జూన్ 7: ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీలు.

 
ఈ కార్యక్రమం చివరి దశలో (మే 16 - జూన్ 9) భాగంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 145 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను (UPHCs) పాలిక్లినిక్‌లుగా అభివృద్ధి చేయనున్నారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా వారీగా ఆరోగ్య నివేదికలను (Report Cards) విడుదల చేయడంతో ఈ మిషన్ ముగుస్తుంది.

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.