7కి చేరిన గులియన్ బారీ సిండ్రోమ్ మృతుల సంఖ్య..
సాక్షి లైఫ్ : పూణేలో గులియన్ బారీ సిండ్రోమ్ (జిబీఎస్) కేసుల సంఖ్య మరింతగా పెరుగుతోంది. ఈ వ్యాధి వల్ల 7 మంది మరణించారు. తాజాగా గులియన్ బారీ సిండ్రోమ్ కారణంగా పుణేకు చెందిన 37 ఏళ్ల యువకుడు మృతిచెందాడు. పూణేలోని బిబ్వేవాడి ప్రాంతానికి చెందిన 37 ఏళ్ల యువకుడు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. జిబీఎస్ వైరస్ సోకడంతో చనిపోయాడు. అతనికి ఆక్యూట్ కార్డియాక్ సిండ్రోమ్ వంటి సమస్యలు ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి..ఎక్కువసేపు కూర్చోవడం వల్ల రక్త ప్రసరణపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ కు మెనోపాజ్ కు లింక్ ఏంటి..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
ఇంకా పెరుగుతున్న కేసుల సంఖ్య..
పూణేలో గులియన్ బారీ సిండ్రోమ్ (జిబీఎస్) సోకిన వారి సంఖ్య 192కి చేరింది, ఇందులో 167 మందికి సిండ్రోమ్ నిర్ధారించారు. ఈ కేసులు పూణె నగర పరిధిలో 39, కొత్తగా చేరిన గ్రామాల్లో 91, పిమ్ప్రీ-చించ్వడ్‌లో 29, పల్లెలో 25 , ఇతర జిల్లాల నుంచి 8 కేసులు నమోదు అయ్యాయి.
రోగుల పరిస్థితి..
నిర్ధారిత 167 కేసుల్లో 91 మందిని డిశ్చార్జి చేశారు. 48 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. 21 మంది వెంటిలేటర్లపై చికిత్స తీసుకుంటున్నారు.
ఇది కూడా చదవండి..డైట్ మధుమేహ నిర్వహణకు ఎలా సహాయపడుతుంది..?
ఇది కూడా చదవండి..డయాబిటిస్ రిస్క్ ఎలాంటివాళ్లకు ఎక్కువ..?
ఇది కూడా చదవండి..హెపటైటిస్ బి, సి ప్రాణాంతకమా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
