చిన్నారుల మృతికి కాఫ్ సిరప్‌లోని ఈ ప్రమాదకరమైన రసాయనమే కారణం..
సాక్షి లైఫ్ : ప్రాణాలను నిలబెట్టాల్సిన ఔషధాలే చిన్నారుల పాలిట మృత్యు పాశాలవుతున్నాయి. అభం శుభం ఎరుగని పసిపిల్లలను బలిగొంటున్నాయి కాఫ్ సిరప్ మందులు. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో కాఫ్ సిరప్ కారణంగా 19 మంది చిన్నారులు మరణించిన సంఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లాలోని కొన్ని గ్రామాల తోపాటు,రాజస్థాన్‌లోని మరికొన్ని ప్రాంతాల్లో కాఫ్ సిరప్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. మరణించిన చిన్నారుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకున్నాయి.
ఇది కూడా చదవండి..సంతానోత్పత్తిని పెంచడానికి ఎలాంటి ఫుడ్స్ తప్పనిసరి అంటే..?
ఇది కూడా చదవండి..పీసీఓడీ సమస్యకు ప్రధాన కారణాలు ఏమిటి..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ప్రధాన కారణం ఇదే..
డైథిలిన్ గ్లైకాల్ (DEG) అనే విష రసాయనం నివేదికల ప్రకారం, ఈ మరణాలకు 'కోల్డ్‌రిఫ్ (Coldrif) కాఫ్ సిరప్' లో అధిక మొత్తంలో కనుగొన్న ప్రమాదకరమైన రసాయనం డైథిలిన్ గ్లైకాల్ (Diethylene Glycol - DEG) కారణమని తేలింది. ఈ రసాయనం వల్ల పిల్లల్లో కిడ్నీలు దెబ్బతినడం లేదా కిడ్నీఫెయిల్యూర్ కు కారణమవ్వడమేకాకుండా, మరికొందరు చిన్నారుల మరణానికి దారితీసింది. పరీక్షల్లో ఈ సిరప్‌లో ప్రమాదకరమైన రసాయనం డైథిలిన్ గ్లైకాల్ సుమారు 48.6 శాతంఉన్నట్లు వెల్లడైంది, ఆరోగ్య ప్రమాణాలకు పూర్తిగా విరుద్ధంగా ఈ కెమికల్ ఉందని పరీక్షల్లో వెల్లడైంది.
ఇప్పటివరకు తీసుకున్న చర్యలు..
మధ్యప్రదేశ్ ఛింద్వారా, బేతుల్‌తో సహా,రాజస్థాన్‌లలో కలిపి మరణించిన చిన్నారుల సంఖ్య 19 కి చేరింది. Coldrif కఫ్ సిరప్‌ను తయారు చేసిన తమిళనాడులోని కాంచీపురం కేంద్రంగా ఉన్న శ్రీసన్ ఫార్మాస్యూటికల్స్ (M/s Sresan Pharmaceutical) సంస్థపై చర్యలు తీసుకున్నారు. తమిళనాడు, మధ్యప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాలలో ఈ 'కోల్డ్‌రిఫ్ కఫ్ సిరప్' అమ్మకం, వినియోగంపై వెంటనే నిషేధం విధించారు.
ఉత్తరప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాల్లోని మెడికల్ స్టోర్లలో ఉన్న ఈ సిరప్ బ్యాచ్‌ల నమూనాలను పరిశీలించి, వాటిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.
ముఖ్యంగా, రెండు సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సు గల పిల్లలకు ఎలాంటి దగ్గు-జలుబు మందులు,కాఫ్ సిరప్‌లు వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వకూడదని గట్టిగా హెచ్చరించింది.
మెడికల్ స్టోర్ యజమానులు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మకుండా జాగ్రత్త వహించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించి, రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్‌ను తొలగించింది.
గుజరాత్‌లో తయారైన మరికొన్ని కఫ్ సిరప్‌లలో (రీ లైఫ్, రెస్పిఫ్రెస్ టీఆర్ వంటివి) కూడా డైథిలిన్ గ్లైకాల్ పరిమితికి మించి ఉన్నట్లు గుర్తించి వాటిని కూడా బ్యాన్ చేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి బాధితుల కుటుంబాలను పరామర్శించి, పరిహారం ప్రకటించారు.ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ను ఏర్పాటు చేశారు. తమిళనాడు ప్రభుత్వం కూడా తయారీ కంపెనీని సీల్ చేసి, చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ కాఫ్ సిరప్ మరణాల కేసుపై ఔషధ భద్రతా వ్యవస్థలో సంస్కరణలు, కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) కూడా దాఖలైంది.
జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ఈ మరణాలపై మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాల నుంచి నివేదిక కోరింది. దేశంలో ఔషధాల నాణ్యత తనిఖీ వ్యవస్థలపై, ముఖ్యంగా పిల్లల మందుల తయారీపై, మరింత కఠినమైన నిఘా అవసరాన్ని ఈ విషాదం నొక్కి చెబుతోంది.
ఇది కూడా చదవండి..క్యారెట్ జ్యూస్ మంచిదేనా..? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు..?
ఇది కూడా చదవండి..కిడ్నీ దానం చేసిన తర్వాత ఆ వ్యక్తికి ఎలాంటి ఫాలో-అప్ కేర్ అవసరం..?
ఇది కూడా చదవండి..ఈ 5 సప్లిమెంట్స్ కు డబ్బు దండగ అంటున్న వైద్యనిపుణులు..!
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
