సాక్షి లైఫ్ : పాలిసిస్టిక్ ఓవరీ డిజార్డర్ (పీసీఓడీ) అండాశయం నుంచి అండం విడుదల కాకుండా ఉండడం వల్ల నెలసరి రాదు. దీని కారణంగా అండాశయంలో అండాలు ఉండిపోవడంతో దాని చుట్టూ నీరు చేరి బుడగలు వస్తాయి. దీనినే "పీసీఓడీ" సమస్య అంటారు. పీసీఓడీ సమస్యను నివారించడానికి కొన్నిరకాల జాగ్రత్తలు అవసరమని వైద్యులు వెల్లడిస్తున్నారు. జీవనశైలిలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసుకోవడం ద్వారా PCOD సమస్యను నివారించవచ్చని, డాక్టర్లు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
పీసీఓడీని ఎలా నివారించాలి..?
పీసీఓడీ సమస్యను నివారించడానికి కొన్నిరకాల జాగ్రత్తలు అవసరమని వైద్యులు వెల్లడిస్తున్నారు. జీవనశైలిలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసుకోవడం ద్వారా PCOD సమస్యను నివారించవచ్చని, డాక్టర్లు చెబుతున్నారు.
పీసీఓడీ నివారణకు జీవనశైలిలో మార్పులు తప్పనిసరి..
పీసీఓడీ అంటే పాలిసిస్టిక్ ఓవరీ డిజార్డర్. ఈ రుగ్మత ఇటీవలకాలంలో మహిళల్లో సర్వసాధారణంగా మారింది. హార్మోన్ల ప్రభావం వల్ల ఈ సమస్య తలెత్తుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. పీసీఓడీ సమస్య కారణంగా అండాశయం నుంచి అండం విడుదల కాదు. దీని వల్ల నెలసరి కూడా రాదు.
ప్రధానంగా అండాశయంలో అండం ఉండటంతో దాని చుట్టూ నీరు చేరి బుడగలు వస్తాయి. ఈ సమస్యను నివారించడానికి జీవన శైలిలో మార్పులు చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ప్రాసెస్ చేసిన ఆహారం..
పీసీఓడీ సమస్య ఉన్నవాళ్లు ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అలాగే చక్కెరతో తయారు చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పదార్థాలను, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న పదార్థాలను తీసుకోవాలని వైద్యులు వెల్లడిస్తున్నారు.
ప్రోటీన్ ఫుడ్..
పీసీఓడీ తో బాధపడుతున్న వారు తమ ఆహారంలో ప్రోటీన్లను పెంచాలని, మాంసకృత్తులు తినడం వల్ల శరీరంలో జీవక్రియ వేగంగా జరుగుతుంది. అంతే కాకుండా ఎక్కువ కేలరీలను బర్న్ చేయడం కూడా చాలా ముఖ్యం. దీని కోసం శారీరక శ్రమ చేయాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
జంక్ ఫుడ్‌కి బదులు..
పిసిఓడి ప్రాబ్లెమ్ ఉన్నవాళ్లు జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా కొవ్వు పదార్ధాలకు బదులుగా, బాదం ,వాల్‌నట్ వంటి డ్రై ఫ్రూట్స్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన వాటిని తినాలని వైద్యలు వెల్లడిస్తున్నారు.
శారీరక శ్రమ..
శారీరక శ్రమ చేయడం చాలా అవసరమని డాక్టర్లు చెబుతున్నారు. వారానికి కనీసం ఐదు రోజులు వర్కవుట్ చేయాలని అంటున్నారు. ఈ మార్పులన్నింటినీ అనుసరించడం ద్వారా PCOD సమస్య నుంచి చాలా వరకు ఉపశమనం పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?