ICMR’s Latest Study Reveals : మెదడువాపునకు ఆ మూడు వైరస్‌లూ కారణమే.. ఐసీఎంఆర్ తాజా పరిశోధనలో వెల్లడి..!
సాక్షి లైఫ్ : మెదడువాపు వ్యాధి (Encephalitis) నిర్ధారణలో వైద్య రంగం మరో ముందడుగు వేసింది. ఇప్పటివరకు డెంగ్యూ, మలేరియా, జపనీస్ ఎన్సెఫాలిటిస్ వంటి వ్యాధులనే మెదడువాపుకు ప్రధాన కారణాలుగా భావిస్తుండగా.. తాజాగా మరో మూడు వైరస్‌లు కూడా ఈ ప్రమాదకర వ్యాధికి దారితీస్తున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి (ICMR) అనుబంధ సంస్థ అయిన రీజినల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ (RMRC) శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
కొత్తగా వచ్చిన వైరస్‌లు..
శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం.. సైటోమెగలోవైరస్ (Cytomegalovirus), హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ (Herpes Simplex Virus),రికెట్‌సియా (Rickettsia) సంక్రమణ వల్ల కూడా మెదడువాపు వచ్చే అవకాశం ఉందని తేలింది. ఈ వివరాలు అంతర్జాతీయ స్థాయిలోని 'జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్'లో ప్రచురితమయ్యాయి.
నిర్ధారణలో ఆర్టీ-పీసీఆర్..
సాధారణంగా మెదడువాపును గుర్తించేందుకు చేసే ఎలీసా (ELISA) పరీక్షల కంటే ఆర్టీ-పీసీఆర్ (RT-PCR) అత్యంత ఖచ్చితమైన ఫలితాలను ఇస్తున్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది. 2022-23 కాలంలో తీవ్ర జ్వరం, ఇతర లక్షణాలతో బాధపడుతూ, ఎలీసా పరీక్షలో నెగటివ్ వచ్చిన 557 నమూనాలను శాస్త్రవేత్తలు పరీక్షించారు. వీటికి ఆర్టీ-పీసీఆర్ నిర్వహించగా.. 34 నమూనాల్లో సైటోమెగలోవైరస్, 12 నమూనాల్లో రికెట్‌సియా, మరో 5 నమూనాల్లో హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ ఉన్నట్లు గుర్తించారు.
కొత్త విధానం ద్వారా గుర్తించడం..
సాంప్రదాయ పరీక్షల్లో బయటపడని ఇన్ఫెక్షన్లను ఈ కొత్త విధానం ద్వారా గుర్తించడం వల్ల రోగులకు మరింత ఖచ్చితమైన మరియు వేగవంతమైన చికిత్స అందించే అవకాశం ఉంటుందని ఆర్‌ఎంఆర్‌సీ డైరెక్టర్ డాక్టర్ హరిశంకర్ జోషి తెలిపారు. దీనివల్ల ప్రాణనష్టాన్ని తగ్గించవచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
