HIV in Pakistan : పాకిస్థాన్‌లో దారుణం.. ఆసుపత్రి నిర్లక్ష్యానికి 331 మంది చిన్నారులకు హెచ్‌ఐవీ..!
సాక్షి లైఫ్ : పాకిస్థాన్‌లో వైద్య సిబ్బంది చేసిన ఘోర తప్పిదం వందలాది మంది చిన్నారుల జీవితాలను అంధకారంలోకి నెట్టింది. టీహెచ్‌క్యూ టౌన్సా నగరంలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగా ఏకంగా 331 మంది చిన్నారులకు హెచ్‌ఐవీ పాజిటివ్‌గా తేలింది. ఒకే సిరంజిని పదేపదే వాడటం వల్లే ఈ మహమ్మారి వ్యాపించినట్లు వెల్లడైంది. ఈ దారుణ పరిస్థితి కారణంగా ఎనిమిదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపుతోంది.
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..
ఒకే సూది.. వందలాది మందికి..!
నవంబర్ 2024 నుంచి అక్టోబర్ 2025 మధ్య కాలంలో ఈ కేసులు వెలుగుచూశాయి. టీహెచ్‌క్యూ (THQ) టౌన్సా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన చిన్నారులకు అక్కడి సిబ్బంది ఒకే సిరంజిని, ఒకే మందుల సీసాను (Vial) ఉపయోగించి ఇంజెక్షన్లు ఇచ్చారు. ఒకరికి వాడిన సూదినే ఇతరులకు వాడటం వల్ల వైరస్ ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాపించింది. ఎనిమిదేళ్ల మహమ్మద్ అమీన్ అనే బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఈ మొత్తం ఉదంతం బయటపడింది. ఆ బాలుడి సోదరికి కూడా ప్రస్తుతం హెచ్‌ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
పరిశోధనలో నమ్మలేని నిజాలు..
బీబీసీ నిర్వహించిన రహస్య దర్యాప్తులో ఆసుపత్రి సిబ్బంది అమానవీయ పోకడలు బయటపడ్డాయి. కొత్త సూదిని మార్చినప్పటికీ, సిరంజి వెనుక భాగం ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిసినా సిబ్బంది నిర్లక్ష్యం వహించారు. కనీసం స్టెరిలైజ్ చేసిన గ్లౌజులు కూడా ధరించకుండానే రోగులకు ఇంజెక్షన్లు ఇచ్చినట్లు రికార్డింగ్‌లలో వెల్లడైంది. వైద్య వ్యర్థాల బుట్టలో నర్సులు చేతులతో వెతకడం వంటి ప్రమాదకర చర్యలు ఇన్ఫెక్షన్ తీవ్రతను మరింత పెంచాయి.
నిపుణుల హెచ్చరిక..
వైద్య రంగంలో ఒకే సిరంజిని లేదా మల్టీ-డోస్ వయల్స్‌ను అజాగ్రత్తగా వాడటం అత్యంత ప్రమాదకరమని అంటువ్యాధుల నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాకిస్థాన్‌లో జరిగిన ఈ ఘటన అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆ దేశంలో, వైద్య సేవలలో ఉన్న ఈ లోపాలు సామాన్యుల ప్రాణాలకు ముప్పుగా పరిణమించాయి.
నా బిడ్డకు ఆసుపత్రిలో వాడిన కలుషితమైన సూదుల వల్లే ఈ జబ్బు సోకింది. ఇప్పుడు నా కొడుకు చనిపోయాడు.. కూతురు చావుబతుకుల్లో ఉంది. మమ్మల్ని ఎవరూ ఆదుకోవడం లేదని మృతి చెందిన అమీన్ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
