గుజరాత్‌లో 73కి చేరిన వైరల్ ఎన్సెఫాలిటిస్ మృతుల సంఖ్య
సాక్షి లైఫ్ : గుజరాత్‌లో చాందీపురా వైరస్ , వైరల్ ఎన్సెఫాలిటిస్ వ్యాప్తి చెందుతోంది. వీటి కారణంగా ఇప్పటివరకు 73 మంది మరణించారు. గత నెలలో వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి గుజరాత్ రాష్ట్రంలో 162 వైరల్ ఎన్సెఫాలిటిస్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 60 చాందీపురా వైరస్ కేసులు ఉన్నాయి. ఈ వ్యాధి మొత్తం 33 జిల్లాల్లో అహ్మదాబాద్, రాజ్‌కోట్, జామ్‌నగర్, వడోదర వంటి నగరాలకు వ్యాపించింది. గుజరాత్ రాష్ట్ర ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించిన గణాంకాల ప్రకారం, సరిహద్దున ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లకు చెందిన ఐదుగురు రోగులు గుజరాత్‌లో మరణించారు.
ఇది కూడా చదవండి..ఆహారం స్కిన్ హెల్త్ పై ఎలాంటి ప్రభావం చూస్తుంది..?
ఇది కూడా చదవండి..స్పైసీ ఫుడ్స్ తినడం వల్ల బరువు తగ్గుతారా..?
చికిత్స పొందుతున్న11 మంది..
గురువారం నాటికి, 11 మంది రోగులు చికిత్స తీసుకుంటున్నారు. 78 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. "అహ్మదాబాద్, రాజ్‌కోట్, జామ్‌నగర్ ,వడోదర వంటి అనేక జిల్లాలు,మునిసిపల్ కార్పొరేషన్ నగరాల నుంచి కేసులు నమోదవడంతో ఇది రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించింది" అని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. గత నెలలో వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిరోజూ రెండు నుంచి మూడు మరణాలు నమోదవుతున్నందున, రాష్ట్ర ఆరోగ్య అధికారులు ప్రభావిత ప్రాంతాలలో నిఘా వేస్తూ, అవసరమైన చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
