హెచ్ ఎంపీవీ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చైనాలో అసలు ఏం జరుగుతోంది..?
సాక్షి లైఫ్ : హ్యూమన్ మెటా న్యుమోవైరస్ (హెచ్ ఎంపీవీ) గురించి ఒక పెద్ద ఉపశ మనం కలిగించే వార్త వచ్చింది. చైనాలో హెచ్ ఎంపీవీ విస్తృతంగా వ్యాప్తి చెందలేదని చైనాలో నివసిస్తున్న భారతీయుడు వెల్లడించాడు. అక్కడ జనజీవనం సాధారణంగానే ఉందని చైనాలో ఉన్న ఒక భారతీయుడు ఆ వీడియోను షేర్ చేశాడు.
ఇది కూడా చదవండి.. కిడ్నీ డిసీజ్ ప్రివెన్షన్ టిప్స్..
ఇది కూడా చదవండి.. చల్లటి నీటికి గుండెపోటుకు లింక్ ఏంటి..?
ఇది కూడా చదవండి.. ఇంట్లోకి దోమలు రాకుండా చిట్కాలు..
చైనాలోని డాలియన్‌లో నివసిస్తున్న కర్ణాటక నివాసి రాజు నాయక్ హెచ్ ఎంపీవీ వ్యాప్తి గురించిన వార్తలకు సంబంధించిన వీడియోను అప్‌లోడ్ చేశారు. "నేను చైనాలోని ఉత్తర ప్రాంతంలో నివసిస్తున్నాను. ఇక్కడ వైరస్ వ్యాప్తి గురించి చాలా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది, ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయని, జనాలు భయాందోళనలో ఉన్నారని నివేదికలు వస్తున్నాయి. కాబట్టి నేను ఈ వీడియోను షేర్ చేస్తున్నాను" అని అన్నారు. కానీ చుట్టూ చూడండి.. ఇక్కడ చాలా సాధారణంగా ఉంది."అంటూ రాజు నాయక్ వీడియోషేర్ చేశాడు.
చైనాలో జనజీవనం సాధారణంగా ఉంది..
షాపింగ్ మాల్స్ తెరిచి ఉన్నాయి. వీధుల్లో జనాల సందడి కనిపిస్తోందని, జనాలు మాస్క్‌లు లేకుండా తిరుగుతున్నారని ఆయన చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
