పూణెలో పెరుగుతున్న జికా వైరస్ కేసులు

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : పూణె జిల్లాలో ఆదివారం నాడు జికా కేసులు ఒక్కసారిగా పెరిగాయని, తాజాగా తొమ్మిది కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 48కి చేరిందని ఆరోగ్య శాఖ తెలిపింది. తొమ్మిది కేసుల్లో, పూణే మున్సిపల్ కార్పొరేషన్ (పిఎంసి) ప్రాంతంలో ఏడు కేసులు, వాఘోలి, పూణే రూరల్ , పూణే కంటోన్మెంట్ బోర్డ్ (పిసిబి) ఏరియాలో ఒక్కొక్కటి నమోదయ్యాయి. ఈ తాజా కేసుల్లో శివనేకి చెందిన 25 ఏళ్ల గర్భిణి కూడా ఉన్నారు.

ఇది కూడా చదవండి..పెరుగులో చక్కెర వేసుకుని తింటే బరువు పెరుగుతారా..?  

ఇది కూడా చదవండి..పేగును శుభ్రపరచడం వల్ల కలిగే ప్రయోజనాలు..

 మహిళకు జ్వరం, దద్దుర్లు, శరీర నొప్పి, తలనొప్పి వంటి లక్షణాలు న్నాయి. ఆమె నమూనాలను జూలై 22 న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) కు పంపారు.

గర్భిణీ స్త్రీలలో జికా వైరస్ పుట్టుకతో వచ్చే మైక్రోసెఫాలీ, గులియన్-బారే సిండ్రోమ్ ,ఇతర నాడీ సంబంధిత సమస్యలను కలిగిస్తుందని అధికారులు తెలిపారు. కోత్రుడ్‌కు చెందిన మరో 80 ఏళ్ల మహిళ జికా వైరస్‌ సోకింది. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి ఆమె చికిత్స పొందుతున్నారు. జూలై 16న ఆమెకు జ్వరం, బలహీనత వంటి లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రిలో చేరారు.

ఇది కూడా చదవండి..హోమియోపతి వైద్యంలో క్యేన్సర్ కు చికిత్స ఉందా..? 

ఇది కూడా చదవండి..WHO Report : ఈ వ్యాధి ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతోంది.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.