సాక్షి లైఫ్ : అరటిపండ్లు వేడి వాతావరణంలో పెరుగుతాయి. ఐతే వాటిని చల్లని వాతావరణంలో ఉంచినట్లయితే పక్వానికి అనుమతించే ఎంజైమ్‌లు నిరోధించడానికి వీలవుతుంది. ఆ ఎంజైమ్‌లు క్రియారహితంగా మారడంతో, ఇతర ఎంజైమ్‌లు మరింత సమర్థవంతంగా పనిచేయడంవల్ల కొన్ని కణాలను దెబ్బతింటాయి. దీంతో అరటి తొక్క నల్లబడుతుంది. కొన్ని రకాల పండ్లను పాడవకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా అరటి పండ్ల విషయంలో కూడా కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా త్వరగా పాడవకుండా ఉంటాయి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్లాస్టిక్ ర్యాప్‌తో చుట్టండి..
ముందుగా అరటి కాడను ప్లాస్టిక్ ర్యాప్‌లో గట్టిగా చుట్టండి. ఇది అరటిపండ్ల నుంచి విడుదలయ్యే వాయువును తగ్గిస్తుంది. తద్వారా అవి త్వరగా చెడిపోకుండా ఉంటాయి.
ఇది కూడా చదవండి.. గట్ హెల్త్ కి ప్రెగ్నెన్సీకి లింక్ ఏంటి..?
గాలిలో వేలాడదీయండి..
అరటిపండ్లను గాలిలో వేలాడదీస్తే, అవి చాలా కాలం పాటు తాజాగా ఉంటాయి. ఇలా చేస్తే అరటిపండ్లు ఒకదానికొకటి తగలకుండా ఉండడం వల్ల పాడవ్వకుండా ఉంటాయి.
ఫ్రిజ్‌లో ఉంచవద్దు..
అరటిపండ్లను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటి పై తొక్క త్వరగా నల్లగా మారుతుంది. అందువల్ల, అరటిపండును ఉష్ణోగ్రత ఎక్కువగా లేని సాధారణ ప్రదేశంలో ఉంచండి.
వాక్స్ పేపర్..
వాక్స్ పేపర్ లో చుట్టడం ద్వారా అరటిపండ్లు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. వాక్స్ పేపర్ లో ఉంచితే అవి పడిపోకుండా ఉండడమే కాకుండా ఉంటాయి.
విటమిన్ "సి" టాబ్లెట్..
విటమిన్ "సి" టాబ్లెట్‌ను నీటిలో కరిగించి అందులో అరటిపండ్లు వేయండి. దీని వల్ల అరటిపండ్లు ఎక్కువ కాలం పాడవకుండా తాజాగా ఉంటాయి.
ఇది కూడా చదవండి.. ఈ సూపర్ ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యానికి డోకా ఉండదు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com