మెంతులతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. 

సాక్షి లైఫ్ : వంటింట్లో అందుబాటులో ఉండే సుగంధ ద్రవ్యాల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అటువంటి వాటిలో మెంతులు కూడా ఒకటి. వీటిని తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య  ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా మెంతులు సుగంధ ద్రవ్యాలుగానేకాదు. దివ్యౌషధంగా  కూడా పనిచేస్తాయి. మహిళలకు మెంతుల వల్ల  జరిగే మేలు అంతా ఇంతా కాదు. 

షుగర్ వ్యాధి తోపాటు అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు మెంతులు ఔష‌ధంలా ప‌నిచేస్తాయి. తినడానికి కాస్త చేదుగా అనిపించినా మెంతులు వల్ల కలిగే కలిగే ఆరోగ్య ప్రయోజనాల రీత్యా మన ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటారు. అందుకే మన పెద్ద వాళ్లు పోపు గింజల్లో మెంతులును ప్రధానంగా చేర్చారు. 

పౌడర్లు, క్యాప్సూల్స్ , నూనెలతో సహా వివిధ రూపాల్లో లభిస్తున్న ఈ మెంతులు పురుషులు,స్త్రీలలో ఇతర వైద్య పరిస్థితులకు కూడా సహాయపడతాయని నమ్ముతారు. మెంతులను వివిధ రూపాల్లో తీసుకోవ‌డం ద్వారా వివిధ ర‌కాల అనారోగ్య‌ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. మ‌రి మెంతుల‌లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం..

మెంతులతో ఆరోగ్యానికి ఎలాంటి మేలు జరుగుతుంది..?  

 -గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 
-బ్లడ్‌ కొలెస్ట్రాల్‌ను, అధిక రక్తపోటును అదుపులో ఉంచడంలో కీలక పాత్ర. 
-మెంతులు (ట్రైగోనెల్లా ఫోనమ్-గ్రేకమ్) అనేది బఠానీ కుటుంబానికి (ఫాబేసి) చెందిన సుగంధ ద్రవ్యాలలో ఒకటి.
-జ్వరం, అలెర్జీలు, గాయాల చికిత్సలో ఉపయోగపడతాయి
-జుట్టు పెరుగుదలకు మెంతులు చాలా బాగా పనిచేస్తాయి

 ఇలా చేస్తే జీర్ణ శక్తి పెరుగుతుంది..

రాత్రిపూట ఒక చెంచా మెంతి గింజ‌ల‌ను నీళ్ల‌లో నాన‌బెట్టి ఉద‌యం లేవ‌గానే ప‌రగ‌డుపున ఆ నీళ్ల‌ను తాగడంవ‌ల్ల‌ అజీర్తి స‌మ‌స్య త‌గ్గుతుంది. జీర్ణ శ‌క్తి మెరుగు ప‌డుతుంది. అదేవిధంగా విరేచ‌నాలు త‌గ్గ‌డానికి కూడా మెంతులు ఉప‌యోగ‌ప‌డుతాయి. మెంతులను వేయించి మెత్తగా పొడిలా చేసుకుని , రోజూ ఉద‌యాన్నే ఆ పొడిని వేడి నీటిలో క‌లుపుకుని తాగితే ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంది.

మెంతులు ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రించ‌డంలో బాగా ప‌నిచేస్తాయి. అదేవిధంగా అజీర్తి, క‌డుపుబ్బ‌రాన్ని కూడా త‌గ్గిస్తాయి. కాబ‌ట్టి మ‌ధుమేహం ఉన్న‌వాళ్లు నిత్యం మెంతులు తీసుకోవడం అలవాటుగా చేసుకోవాలని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. మెంతుల్లో ఉండే ఫైబ‌ర్ క‌డుపు నిండిన భావ‌న క‌లిగిస్తుంది. తద్వారా ఆకలి కూడా తగ్గుతుంది. ఆ సమయంలో ఒంట్లో కొవ్వు క‌రుగుతుంది. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : fenugreek-benefits

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com