హొలీ రంగులను ఎలా తొలగించాలి..?  

సాక్షిలైఫ్ : హొలీ పండుగ సందర్భంగా చిన్నా,పెద్ద అందరూ రకరకాల రంగులు పులుము కుంటారు. వాటిని తొలగించాలంటే కాస్త సమయం పడుతుంది. అందుకోసం కొన్ని చిట్కాలను ఫాలో అవ్వాలి.. రంగుల మరకలను తొలగించడానికి, కిరోసిన్, పెట్రోల్, స్పిరిట్‌లను ఉపయోగిస్తుంటారు కొందరు. అటువంటివి అస్సలు వాడకూడదు. ఎందుకంటే అవి చర్మాన్ని మరింత పొడిగా మారుస్తాయి.

ఇది కూడా చదవండి..  ఒత్తిడిని తగ్గించే ఫుడ్.. ఇదిగో..  

ఫేస్ ప్యాక్.. 

హోలీ రంగులను తొలగించడానికి, మీరు ఇంటిలో తయారు చేసిన డై ఫేస్ ప్యాక్‌ని ఉపయోగించవచ్చు.. అంటే ..? శెనగపిండి, పెరుగు, పసుపుతో చేసిన ఫేస్ ప్యాక్ రంగులను తొలగించడంలో సహాయపడుతాయి. అంతేకాకుండా చర్మానికి ఎటువంటి హాని కలగదు.  చర్మంపై ఉన్న మృతకణాలు కూడా సులభంగా శుభ్రమవుతాయి.

మాయిశ్చరైజ్..  

రంగులు వాడడం వల్ల చర్మంలోని సహజ నూనెలు తగ్గిపోయి చర్మం చాలా పొడిగా, నిర్జీవంగా కనిపిస్తుంది. తేమ లేకపోవడం వల్ల, చర్మం పగిలినట్లు అవుతుంది. అందువల్ల, రంగులను తొలగించిన తర్వాత, మీ చర్మాన్ని మంచి మాయిశ్చరైజర్‌ క్రీమ్ తో మాయిశ్చరైజ్ చేయండి. ఇది చర్మానికి పోషణనిస్తుంది, స్కిన్ ప్రోబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. చేతులు, పాదాలకు కొబ్బరి నూనెను రాయడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. అయితే ముఖం మీద మాత్రమే ఫేస్ మాయిశ్చరైజర్ ఉపయోగించాలి.

అలోవెరా జెల్..  
 
రంగులలో ఉండే కెమికల్స్ కారణంగా చర్మంపై ఒక్కోసారి దద్దుర్లు,స్కిన్ అలెర్జీలు కూడా వస్తాయి. చర్మానికి సంబంధించిన ఏవైనా సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, అలోవెరా జెల్ లేదా చల్లని రోజ్ వాటర్ ను చర్మంపై అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తవు.

ఇది కూడా చదవండి.. టీబీ దగ్గు-సాధారణ దగ్గు తేడాలను ఎలా గుర్తించాలి..? 

హైడ్రేటెడ్..  

డీహైడ్రేషన్ కారణంగా, చర్మం మరింత పొడిగా మారుతుంది. అందువల్ల, రోజంతా పుష్కలంగా నీరు తాగాలి. కొబ్బరి నీరు, నిమ్మకాయ నీరు మొదలైనవి తాగడం వల్ల శరీరంలోని ఎలక్ట్రోలైట్లు కూడా సమతుల్యమవుతాయి. శరీరం లోపల నుంచి నిర్విషీకరణ జరుగుతుంది, ఇది చర్మానికి మాత్రమే కాకుండా మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

హెర్బల్ టీ .. 
 
హోలీ రంగుల కారణంగా చర్మంలో చాలా టాక్సిన్స్ పేరుకుపోతాయి.  వేయించిన ఆహారపదార్థాలు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో చాలా టాక్సిన్స్ ఏర్పడతాయి, ఇది చర్మంతో పాటు మొత్తం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. కాబట్టి శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి హెర్బల్ టీని తాగండి. హెర్బల్ టీ యాంటీ-ఆక్సిడెంట్లను కలిగి ఉండడం వల్ల చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

మేకప్ వేసుకోవద్దు.. 

హోలీ రంగులు చర్మంపై ఉన్నప్పుడు మేకప్ వేసుకోకూడదు. ఎందుకంటే ఎంత శుభ్రంగా కడిగినా కొంతమేర రంగులు చర్మంపై ఉంటాయి. ఇవి స్వేద రంధ్రాల్లోకి వెళ్లి మరింత హానికలిగించే అవకాశం ఉంటుంది. అందువల్ల, హోలీ ఆడిన తర్వాత కనీసం 24 గంటల పాటు మేకప్ వేయకపోవడం మంచిది.

సన్‌స్క్రీన్..  

హోలీ ఆడిన తర్వాత, చర్మం రంగుల కారణంగా దెబ్బతినవచ్చు. కాబట్టి,  సన్ స్క్రీన్ అప్లై చేయడం మర్చిపోవద్దు. ఇది చర్మానికి అదనపు రక్షణను అందిస్తుంది.

ఇది కూడా చదవండి.. సి విటమిన్ లోపిస్తే శరీరంలో ఎలాంటి సమస్యలు వస్తాయి..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : skin-care-tips home-remedies home-tips skin-problems home-healthy-tips holi-colors healthy-skin

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com