సి విటమిన్ లోపిస్తే శరీరంలో ఎలాంటి సమస్యలు వస్తాయి..?  

షేర్ చేయండి:
సి విటమిన్ లోపిస్తే శరీరంలో ఎలాంటి సమస్యలు వస్తాయి..?  

సాక్షి లైఫ్ : ఏ వ్యక్తి అయినా ఆరోగ్యంగా ఉండాలంటే, అతని రోగనిరోధక శక్తి  సరిపడా ఉండాలి. అటువంటి పరిస్థితిలో ఆరోగ్యంగా ఉండటానికి రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుకోవాలనుకుంటే, ఆహారంలో ఈ విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవాలి. సీజన్‌ మారుతున్నసమయంలో జలుబు,దగ్గు సహజంగా వస్తాయి. ఆయా సమస్య నుంచి బయట పడాలంటే విటమిన్ సి ఎక్కువగా ఉండే  పలురకాల పండ్లు తీసుకోవాలి. సి విటమిన్ ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ "సి" అధికంగా ఉండే ఆహారం..  వాతావరణంలో మార్పులు ప్రారంభమైన వెంటనే శరీర రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. తద్వారా ఇన్‌ఫెక్షన్లు తలెత్తే  అవకాశం ఉంది. 

ఇది కూడా చదవండి.. టీబీ దగ్గు-సాధారణ దగ్గు తేడాలను ఎలా గుర్తించాలి..? 

విటమిన్ సి లోపం వల్ల ఏ సమస్యలు వస్తాయంటే..? 

అకస్మాత్తుగా బరువు పెరగడం, 
శరీరంపై దద్దుర్లు
దంతాలు సున్నితంగా మారడం
చిగుళ్ల నుంచి రక్తం
కంటి చూపు మందగించడం
జుట్టు రాలడం
రక్తహీనత
జాయింట్ పెయిన్స్,వాపు 
 ఎముకాలు బలహీనత
 గాయం ఆలస్యంగా నయం అవ్వడం
 శ్వాస ఆడకపోవడం 
 మానసిక స్థితిలో మార్పులు, నిరాశ

ఇది కూడా చదవండి..  ఒత్తిడిని తగ్గించే ఫుడ్.. ఇదిగో..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.