యాపిల్‌తో పాటు వీటిని కలిపి తినకూడదా..?  

షేర్ చేయండి:
యాపిల్‌తో పాటు వీటిని కలిపి తినకూడదా..?  

సాక్షి లైఫ్ : యాపిల్ పండ్లలో అత్యుత్తమ పోషకాలుంటాయి. రోజుకో యాపిల్ తినండి, డాక్టర్ కు దూరంగా ఉండండి అనే నానుడి ఉంది. యాపిల్స్ రోగనిరోధక శక్తిని అందిస్తాయి. వీటిలో శరీరానికి అవసరమైన వివిధ పోషకాలు ఉంటాయి. యాపిల్ వల్ల ఇన్ని లాభాలు ఉన్నా.. దీనిని తిన్న తర్వాత కొన్ని పదార్థాలు తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ఆ అంశాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

 ఇది కూడా చదవండి.. ప్రీమెన్‌ స్ట్రువల్ సిండ్రోమ్ వచ్చేముందు లక్షణాలు ఎలా ఉంటాయి..?

 

 ఇది కూడా చదవండి.. శరీరంలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ ఎంత ఉండాలి..? 

పెరుగు..

యాపిల్‌తో పెరుగు తినకూడదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. యాపిల్ తిన్న తర్వాత కనీసం 2 గంటల పాటు పెరుగు తినకూడదని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే యాపిల్, పెరుగు రెండూ చల్లదనాన్ని కలిగి ఉంటాయి. శరీరంలో జలుబును కలిగిస్తాయి.
 
పుల్లని ఆహారాలు.. 

యాపిల్ తిన్న తర్వాత పుల్లని పదార్థాలు తినడం మానుకోండి. నిమ్మ, నారింజ వంటి పండ్లను తినకూడదని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే యాపిల్ తో పాటు వీటిని తింటే గ్యాస్, మలబద్ధకం, అసిడిటీ వచ్చే అవకాశం ఉంది.

ముల్లంగి.. 

ఇది పోషక విలువలున్న కూరగాయ అయినప్పటికీ యాపిల్ తో పాటుగా తింటే చర్మ సమస్యలు వస్తాయి. యాపిల్‌తో పాటు ముల్లంగిని తింటే ఎలర్జీలు, దద్దుర్లు వస్తాయని చెబుతారు. అయితే, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు.

 ఇది కూడా చదవండి.. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.   

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.