సాక్షి లైఫ్ : వర్షాకాలంలో వివిధ రకాల వ్యాధులు, అంటువ్యాధులు చాలా సాధారణం. ఈ సీజన్లో మన ఆరోగ్యంతో పాటు కళ్లు కూడా చాలా రకాలుగా ప్రభావితమవుతాయి. కంటి సంబంధిత సమస్యలు కూడా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తాయి. అటువంటి పరిస్థితిలో వాటిని నివారించడానికి ఏమేం చేయాలో తెలుసుకుందాం.. రెయిన్ సీజన్‌ను చాలా మంది ఇష్టపడుతారు. ఈ కాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ అనేక వ్యాధులు, అంటువ్యాధులు కూడా వేగంగా పెరుగుతాయి.
అనారోగ్య సమస్యలతో పాటు, కంటి సంబంధిత సమస్యలు వర్షాకాలంలో ఇబ్బందులకు గురిచేస్తాయి. వర్షాకాలంలో తేమ, తరచుగా కురుస్తున్న వర్షాలు కంటికి సంబంధించిన వివిధ ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. అటువంటి పరిస్థితిలో ఈ ఇన్ఫెక్షన్ల గురించి తెలుసుకోవాలి. వర్షాకాలంలో సంభవించే ఐదు సాధారణ కంటి ఇన్ఫెక్షన్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యనిపుణులు చెబుతున్నారు.
వర్షాకాలంలో వచ్చే కంటి ఇన్ఫెక్షన్లలో కండ్లకలక ఒకటి. దీని ప్రధాన లక్షణాలు కళ్ళలో ఎరుపు, దురద. ఈ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా, వైరస్ లేదా అలెర్జీ వల్ల సంభవించవచ్చు. దీనిని నివారించడానికి, క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, కళ్లను తాకకుండా ఉండటంతోపాటు మంచి పరిశుభ్రతను కాపాడుకోవడం చాలా ముఖ్యం.
స్టై లేదా హార్డియోలమ్..
హార్డియోలమ్ లేదా స్టై అని కూడా పిలుస్తారు, ఇది కనురెప్పల అంచున ఏర్పడే బాధాకరమైన, ఎర్రటి కురుపు. ఇది సాధారణంగా తైల గ్రంధులలో బ్యాక్టీరియా సంక్రమణ వలన సంభవిస్తుంది. ఇది వాపు, నొప్పి వంటి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. కంటి పరిశుభ్రతను కాపాడుకోవడం, తువ్వాలు వంటి వ్యక్తిగత వస్తువులను పంచుకోకుండా ఉండటం వలన ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
కెరాటిటిస్..
ఇది కార్నియా వాపు, తరచుగా బ్యాక్టీరియా, వైరల్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. దీని లక్షణాలు కళ్ళు ఎర్రబడటం, నొప్పి, దృష్టి సమస్య, కాంతిని చూడలేకపోవడం. ముఖాన్ని కడుక్కోవడానికి శుభ్రమైన నీటిని ఉపయోగించడం, కాంటాక్ట్ లెన్స్‌లను ఎక్కువగా ఉపయోగించకుండా ఉండటం కెరాటిటిస్ను నివారించడంలో సహాయపడవచ్చు.
యువెటిస్..
యువెటిస్ అనేది కంటి మధ్య పొర, యువియా వాపు. ఇది ఇన్ఫెక్షన్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ లేదా గాయాల వల్ల రావొచ్చు. కంటి నొప్పి, ఎరుపు ,మసక వంటివి దీని లక్షణాలు. యువెటిస్ను నివారించడానికి, కంటికి సంబంధించిన ఏదైనా సమస్యకు తక్షణ వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం.
ఫంగల్ కంటి ఇన్ఫెక్షన్..
వర్షాకాలంలో తేమ కారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. ఈ ఇన్ఫెక్షన్లు కళ్లలోని వివిధ భాగాలను ప్రభావితం చేస్తాయి. వెంటనే చికిత్స చేయకపోతే, తీవ్రమైన సమస్యలు వస్తాయి. దీనిని నివారించడానికి, రక్షిత అద్దాలు ధరించడం,కండ్లను శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.
ఇది కూడా చదవండి.. తినే సమయంలో నీళ్లు తాగకూడదా..? ఏమౌతుంది..?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా క్యాన్సర్ రావడానికి కారణాలేంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com