Rubisco : ఆరోగ్యంగా ఉంచడంలో "రుబిస్కో" ఎలాంటి పాత్ర పోషిస్తుంది..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మనం నిత్యం చూసే ప్రతి పచ్చని ఆకులోనూ ఈ రుబిస్కో (రిబ్యులోజ్-1,5 బైస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేస్-ఆక్సిజనేస్) అనే ఎంజైమ్ ఉంటుంది. మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ (Photosynthesis) ద్వారా వాతావరణంలోని కర్బన ఉద్గారాలను (Carbon Dioxide) గ్రహించి, వాటిని చక్కెరలుగా మార్చడంలో ఈ ఎంజైమ్ కీలక పాత్ర పోషిస్తుంది. భూమిపై జీవకోటి మనుగడకు ఇది ఒక రకంగా ఆధారమని చెప్పవచ్చు.

 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..Sippers and Tumblers : సిప్పర్లు, టంబ్లర్లలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..?

ఇది కూడా చదవండి..Low Birth Weight : తక్కువ బరువుతో పుడితే.. పెద్దయ్యాక పక్షవాతం ముప్పు..! తాజా అధ్యయనం..

 

ఆరోగ్యానికి ఎందుకు మేలు..?

సహజంగా లభించే ఈ ప్లాంట్-బేస్డ్ ప్రోటీన్‌లో మానవ శరీరానికి అవసరమైన తొమ్మిది రకాల ముఖ్యమైన అమైనో ఆమ్లాలు (Essential Amino Acids) సమృద్ధిగా ఉన్నాయి. దీనివల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఇవే.. సులభంగా జీర్ణమవుతుంది..ఇది కడుపులోకి వెళ్లిన వెంటనే వేగంగా జీర్ణమై, కండరాల పునరుద్ధరణకు (Muscle Repair) తోడ్పడుతుంది. అలెర్జీలు ఉండవు.. సోయా, పాలు, లేదా గ్లూటెన్ వంటి వాటితో అలెర్జీ సమస్యలు ఎదుర్కొనేవారికి ఇది ఒక సురక్షితమైన ప్రత్యామ్నాయం. రుచి, రంగు..దీనికి ప్రత్యేకమైన ఘాటైన రుచి లేదా వాసన ఉండదు. అందువల్ల దీనిని ఏ రకమైన ఆహార పదార్థాలలోనైనా సులభంగా కలపవచ్చు.

ప్రధాన సవాలు ఏమిటంటే..?

ప్రతి ఆకులోనూ రుబిస్కో ఉన్నప్పటికీ, ఆకు మొత్తం బరువులో ఇది కేవలం 3 శాతం మాత్రమే ఉంటుంది. దీనిని వేరు చేయడం చాలా ఖరీదైన, సంక్లిష్టమైన ప్రక్రియ. ఆకులను కోసిన కొన్ని గంటల్లోనే ఈ ప్రోటీన్‌ను వేరు చేయాల్సి ఉంటుంది, లేదంటే అది వృథా అవుతుంది.

మార్కెట్లోకి ఎప్పుడు వస్తుంది..?

ప్రస్తుతం అమెరికా, నెదర్లాండ్స్, న్యూజిలాండ్‌కు చెందిన కొన్ని స్టార్టప్ కంపెనీలు ప్లాంటిబుల్ ఫుడ్స్, లీఫ్ట్ ఫుడ్స్ వంటివి ఈ సాంకేతికతపై పరిశోధనలు చేసి, వాణిజ్యపరంగా రుబిస్కోను ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే, ఇది సామాన్యులకు అందుబాటు ధరలో మార్కెట్లోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. రాబోయే దశాబ్దంలో గ్రీన్ ప్రోటీన్ విప్లవానికి ఇది నాంది కాబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇది కూడా చదవండి..Social Phobia : నలుగురిలోకి వెళ్లాలంటే భయమా..? మీలో 'సోషియోఫోబియా' లక్షణాలు ఉన్నాయేమో..

ఇది కూడా చదవండి..Latest Research : వీడిన కీటకాలను బంధించే వీనస్ ఫ్లైట్రాప్ రహస్యం..శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ..!

ఇది కూడా చదవండి..Weight Lose : బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే మీ డైట్‌లో 'ఫైబర్' పెరగాల్సిందే..! శాస్త్రీయ కారణాలు ఇవే..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.