Evidence of negligence : పీహెచ్‌సీలో పసికందుపై పడిన ఫ్యాన్‌.. రూ. 50 వేలు ఇవ్వాలని హెచ్‌ఆర్‌సీ ఆదేశం.. 

సాక్షి లైఫ్ : ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణలో నిర్లక్ష్యం పరాకాష్టకు చేరుకుంది. పేద ప్రజలకు వైద్యం అందించాల్సిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో పసికందుపై సీలింగ్‌ ఫ్యాన్‌ ఊడిపడిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ పీహెచ్‌సీలో జరిగిన ఈ ఘటన ప్రభుత్వ ఆరోగ్య మౌలిక వసతుల దుస్థితిని కళ్ళకు కట్టింది.

 

ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ.. 

 

గుడిహత్నూర్ మండలం కొద్దుగూడ గ్రామానికి చెందిన పాయల్‌ జాదవ్‌కు పుట్టిన రెండు రోజుల నవజాత శిశువుపై జూన్‌ 22న వార్డులోని శిథిలావస్థకు చేరిన సీలింగ్‌ ఫ్యాన్‌ అకస్మాత్తుగా ఊడి పడింది. ఈ హఠాత్పరిణామానికి తల్లి భయభ్రాంతులకు గురైనా, తక్షణమే అప్రమత్తమై బిడ్డను పక్కకు తీయడంతో పెనుప్రమాదం తప్పింది.

కానీ శిశువు తలకు, వీపు భాగంలో గాయాలై, స్వల్ప ఎముక పగులు (Fracture), సబ్‌డ్యురల్‌ హెమటోమా (మెదడుపై రక్తం గడ్డకట్టడం) అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది పసికందును మెరుగైన చికిత్స కోసం రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు.

న్యాయం కోసం హెచ్‌ఆర్‌సీ జోక్యం.. 

ఈ దారుణ ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) సుమోటోగా కేసు నమోదు చేసి తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ ఆరోగ్య సౌకర్యాల నిర్వహణలో ఇది 'తీవ్రమైన అశ్రద్ధ' అని, రోగుల భద్రతను నిర్ధారించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కమిషన్ ఛైర్మన్ జస్టిస్‌ షమీమ్ అఖ్తర్ పేర్కొన్నారు.

నవజాత శిశువుకు అయిన గాయాలు, ఆ కుటుంబం అనుభవించిన మానసిక వేదనను గుర్తించిన కమిషన్... బాధితురాలైన తల్లికి రూ. 50వేలు పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలపై రెండు నెలల్లోగా కంప్లయెన్స్ రిపోర్ట్ సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కమిషన్ ఆదేశించింది. శిథిలమైన భవనాలు, పాతబడిన పరికరాలతో ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్న ప్రభుత్వాసుపత్రుల తీరుపై ప్రజలు, ప్రజాసంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి.. 

 

ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..? 

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

Tags : new-born-baby telangana telangana-government phc-negligence hrc-compensation-order government-hospital-safety ceiling-fan-incident public-health-centre human-rights-commission telangana-phc
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com