ప్రపంచవ్యాప్తంగా హైపర్‌టెన్షన్‌ బాధితులు వీళ్లే..  

సాక్షి లైఫ్: రక్తపోటు కారణంగా అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి బీపీని నివారించడం చాలా ముఖ్యం. హై బీపీనే "హైపర్‌టెన్షన్‌" అని కూడా అంటారు. హైపర్‌టెన్షన్‌ను ఎలా నివారించవచ్చు..? ఏమి చేస్తే ఆ సమస్య నుంచి బయట పడొచ్చు..? దీనిపై వైద్యనిపుణులు ఏమంటున్నారు..? ఈరోజు వరల్డ్ హైపర్‌టెన్షన్ డే సందర్భంగా  సాక్షి లైఫ్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. బీపీ గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. 

ఇది కూడా చదవండి.. ఆక్యుపంచర్ చికిత్సలో సైడ్ ఎఫెక్ట్స్..?

 128 కోట్ల మంది బాధితులు.. 

ఈ రోజుల్లో చాలా మంది హై బీపీతో పోరాడుతున్నారు. అధిక రక్తపోటును హైపర్‌టెన్షన్ అని కూడా అంటారు. ఇది తీవ్రమైన సమస్య, ఇది ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించే అంశం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 30-79 ఏళ్ల మధ్య వయసున్న 128 కోట్ల మంది హైపర్‌టెన్షన్ సమస్యతో బాధపడుతున్నారు.

ప్రతి సంవత్సరం.. 

అందువల్ల, ఈ వ్యాధి గురించి ప్రజలకు మరింత అవగాహన కల్పించడానికి, దాని లక్షణాల గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 17న జరుపుకుంటారు.


 తీవ్రమైన వ్యాధులు..


అధిక రక్తపోటు ఆరోగ్యానికి తీవ్రహాని కలిగిస్తుంది. ఇది గుండె జబ్బులు, మధుమేహం వంటి అనేక తీవ్రమైన వ్యాధులకు కూడా కారణమవుతుంది. మరికొంతమందిలో మానసికసమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. 

ఇది కూడా చదవండి.. భారతీయ ఆహార మార్గదర్శకాలను విడుదల చేసిన ఎన్ఐఎన్

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : high-bp young-people hypertension world-hypertension-day world-hypertension-day-2024-theme high-blood-pressure

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com